EPAPER

Tollywood:తెలంగాణ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టేదెప్పుడు?

Tollywood:తెలంగాణ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టేదెప్పుడు?

Not giving Encouragement on Telangana film development


కళకు భాష బేధం లేదు. ఏ భాషలో తీసినా అందులో విషయం ఉంటే ఆ సినిమా ఆడుతుంది. అదంతా పక్కన పెడితే వందేళ్ల సినీ చరిత్రలో ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంది. మొన్నటి ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ రేంజ్కి సైతం వెళ్లిపోయింది. నాటు నాటు పాట సరిహద్దుల ఎల్లలు దాటేసి ఆస్కార్ అందుకుంది. మరి ఆ పాటను రాసిన చంద్రబోస్. పాడిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. ట్యాలెంట్ ఎప్పుడూ ఒకరి సొత్తు కాదు. రెండు దశాబ్దాల క్రితం వరకూ కూడా తెలంగాణ భాష, యాస అణిచివేతకు గురయింది. కేవలం కమెడియన్ పాత్రలు లేక విలన్ పాత్రలకు మాత్రమే తెలంగాణ భాషను ఉపయోగిస్తూ హాస్యం పేరిట అపహాస్యం చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. హీరోహీరోయిన్లు సైతం తెలంగాణ బాషలో మాట్లాడేస్తున్నారు. ఇప్పడు తెలంగాణ మాట, పాట రెండూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఆస్కార్ వెనుక తెలంగాణ కళాకారులు


తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తెలంగాణ పాటలు జనంలో నాటుకుపోయాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. వాస్తవానికి సినిమా నిర్మాణ సంస్థలు, స్టూడియోలు, నటీనటులు, నిర్మాత, దర్శకులు అంతా హైదరాబాద్ లోనే స్థిరనివాసాలు ఏర్పరుచుకుని ఫిలిం నగర్ కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో నేడు ట్యాలెంట్ ఉన్నవారికి కొదవేమీ లేదు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు టెక్నీషియన్లుగా రాణిస్తున్నారు. వీళ్లందరికీ సరైన ప్రోత్సాహం ఏది? అంటే ప్రశ్నార్థకం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సీఎంగా తెలంగాణ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.

ఫిలిం సిటీపై దృష్టి సారించని కేసీఆర్

రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా చౌటుప్పల్ ప్రాంతంలో భారీ స్థాయిలో స్టూడియో నిర్మిస్తామని చెప్పారు. దానిపై మళ్లీ ఎలాంటి కదలికలు మొదలవలేదు. తెలంగాణ ప్రాంతంలో సినిమా రంగంపై అభిరుచి కలిగిన నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవచ్చు. యానిమేషన్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు కట్టించి తెలంగాణ సినిమా పరిశ్రమకు ఊతం ఇవ్వొచ్చు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పట్లో అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు జరిగేవి. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఎన్నో హైదరాబాద్ లో జరిగేవి. ఇప్పుడవన్నీ ఎక్కడో వేరే ప్రాంతాలలో జరుగుతున్నాయి.

నంది తరహాలో తెలంగాణ అవార్డులు

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నంది అవార్డుల పేరిట ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఎంతో వైభవంగా అవార్డుల నిర్వహణ జరిగేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి ఓ అవార్డు పెట్టి కళాకారులను గౌరవించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికీ వస్తునే ఉన్నాయి. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అయినా వీటిపై దృష్టి పెడితే బాగుంటుందని అంతా కోరుతున్నారు. లేకపోతే తెలుగు చిత్ర సీమగానే పరిశ్రమ వర్ధిల్లుతుంది తప్ప తెలంగాణ చిత్ర పరిశ్రమగా ఎన్నటికీ గుర్తించబడదన్న సంగతి పాలకులు గ్రహించాలి.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×