EPAPER

Nora Fatehi: తప్పుడు మనుషులను నమ్మాను, మానసికంగా కృంగిపోయాను.. ‘మట్కా’ నటి కామెంట్స్

Nora Fatehi: తప్పుడు మనుషులను నమ్మాను, మానసికంగా కృంగిపోయాను.. ‘మట్కా’ నటి కామెంట్స్

Nora Fatehi: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, కచ్చితంగా ప్రతీ ఒక్కరు దానిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది. కొందరు హీరోయిన్స్ సైతం ఇదే విషయాన్ని నిజమని ఒప్పుకున్నారు కూడా. కానీ కొందరు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఏవీ ఎదురవ్వలేదని చెప్పేశారు. ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం తాను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తలో ఏయే కష్టాలు పడిందో అంతా వివరంగా చెప్పుకొచ్చింది. తను మరెవరో కాదు.. నోరా ఫతేహి (Nora Fatehi). బీ టౌన్‌లో గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకున్న నోరా.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’లో కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.


అప్పట్లో అర్థం కాలేదు

నోరా ఫతేహి ఇండియన్ అమ్మాయి కాదు.. కానీ సినిమాల్లో నటించాలనే ఆశతో ఇండియాలో అడుగుపెట్టింది. తాను ఇండియాకు వచ్చినప్పుడు తన వయసు కేవలం 22 ఏళ్లే అని గుర్తుచేసుకుంది ఈ భామ. ‘‘ఇండియాకు వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. అందుకే చాలాసార్లు తప్పుడు మనుషులను నమ్మాను. వారి ఆలోచనలు మంచివే అనుకున్నాను. ఇప్పుడైతే నాకు అన్ని అర్థమయ్యాయి కాబట్టి ఎవరు నువ్వు? నా నుండి ఏం కావాలి? అని నేరుగా అడగగలను. ఎవరూ ఏది ఫ్రీగా చేయరు అని అర్థం చేసుకున్నాను. కానీ అప్పట్లో అలా కాదు.. దేవుడే నాకోసం ఈ మనిషిని పంపించాడు అనుకొని చాలామంది వెధవలను ఫాలో అయ్యాను’’ అని మొహమాటం లేకుండా చెప్పేసింది నోరా.


Also Read: పెద్ద హీరోలకు అలాంటి హీరోయిన్సే కావాలి.. బాలీవుడ్ స్టార్లపై తాప్సీ కాంట్రవర్షియల్ కామెంట్స్

ఇంటికి వెళ్లిపోదామనుకున్నా

‘‘కొందరు నాకు సాయం చేస్తానని వచ్చి నిజంగానే సాయం చేశారు కూడా. కానీ దానికి బదులుగా ఏదో ఒకటి ఆశించేవారు. అందుకే నాకు అసలు సేఫ్టీ లేదనిపించేది. దానివల్లే కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కున్నాను. సాయం చేసిన తర్వాత దీని వల్ల నాకేం వస్తుంది అని అడిగేవారు. నాకేం చేయాలో తెలిసేది కాదు’’ అని గుర్తుచేసుకుంది నోరా ఫతేహి. కొన్నాళ్లు ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన తర్వాత ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడం మొదలుపెట్టానని చెప్పింది నోరా. తనకు అవకాశాలు కావాలని ఎదురుచూడడం వల్లే సమస్యలు వచ్చాయని అర్థం చేసుకొని తిరిగి ఇంటికి కూడా వెళ్లిపోదామని అనుకుందట. అదే సమయంలో మనుషులకు దూరంగా ఉండడం వల్ల తనకు సమస్యలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది.

మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది

‘‘ఇండస్ట్రీలో నేను ఎదుర్కున్న రిజెక్షన్ నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. దానికోసం నేను థెరపీకి కూడా వెళ్లాల్సి వచ్చింది. నేను థెరపీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే మనకు ఎక్కువసార్లు రిజెక్షన్ ఎదురయితే మన మీద మనకు నమ్మం పోతుంది. కత్రినా కైఫ్ అవ్వాలనుకుంటున్నావా అని నన్ను చాలామంది హేళన చేశారు. చాలాసార్లు ఇది చాలా దారుణం అని నాకు నేనే అనుకునేదాన్ని’’ అని తెలిపింది నోరా ఫతేహి. ఆ కష్టాలన్నీ అధిగమించిన తర్వాత ప్రస్తుతం తనకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. తెలుగులో కూడా ‘బాహుబలి’, ‘టెంపర్’ లాంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌తో అలరించింది.

Related News

Vijay Devarakonda: సెట్ లో ప్రమాదం.. విజయ్ దేవరకొండకు గాయాలు

ENE2: టీమ్ కన్యరాశి తిరిగి వస్తుంది.. గ్యాంగ్స్ తో రెడీగా ఉండండ్రా కుర్రాళ్లు..?

Samantha: ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు.. నా కండీషన్ బాలేదు

Bloody Beggar Trailer: బ్లడీ బెగ్గర్.. బకరా ఎలా అయ్యాడు.. ?

Film Stars: అత్యధికంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే..!

Jabardast Abhi: బలగం వేణు బాటలో మరో కమెడియన్.. మైథాలజీ సిరీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు..!

Nikhil Siddhartha: ప్రమోషన్స్ చేయనప్పుడు.. సినిమాలు ఎందుకు చేస్తున్నావ్.. ?

Big Stories

×