EPAPER
Kirrak Couples Episode 1

Nithya Menen on casting couch : ఆ తమిళ హీరో ఇబ్బంది పెట్టాడు

Nithya Menen on casting couch : ఆ తమిళ హీరో ఇబ్బంది పెట్టాడు
Nithya Menen on casting couch


Nithya Menen on casting couch : సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అని, చాలామంది హీరోయిన్లు, నటీమణులు.. వారి వేధింపులకు గురయ్యారని చెప్తుంటారు. కానీ కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమకు అలాంటివి ఏమీ జరగలేదని అంటుంటారు. ఎంతమంది హీరోయిన్లు వేధింపులకు గురయ్యామని చెప్పారో.. అంతేమంది తమకు అలాంటి అనుభవం కలగలేదని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు అలాగే చెప్పిన నిత్యా మీనన్ కూడా తాజాగా తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్.. ‘అలా మొదలైంది’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తన పాత్రకు ప్రాధ్యానత ఉంటే మాత్రమే సినిమాలను ఒప్పుకుంటుంది అనే గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళంలో కూడా నిత్యా మీనన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాలు అయినా.. తనకు గుర్తింపు ఉంటేనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటుంది ముద్దుగుమ్మ. అంతే కాకుండా ముక్కుసూటిగా మాట్లాడే లక్షణం తన సొంతం.


ఇప్పటివరకు నిత్యా మీనన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువసార్లు మాట్లాడడానికి ఇష్టపడలేదు. తనకు కూడా అలాంటి అనుభవం కలిగిందని చెప్పి సైలెంట్ అయిపోయింది. కానీ తాజాగా తనకు జరిగిన అనుభవం గురించి స్పష్టంగా బయటపెట్టింది నిత్యా. కామాంధులు అనేవారు ప్రతీ రంగంలో ఉంటారని చెప్పుకొచ్చింది. అలాగే సినీ పరిశ్రమలో కూడా అలాంటి వ్యక్తులు కచ్చితంగా ఉంటారని మనం చెప్పలేం అంటోంది. ఆపై తనకు కోలివుడ్‌లో ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది.

తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది నిత్యా మీనన్. ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో తనను బాగా వేధించాడని, సీన్ చేస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని బయటపెట్టింది. కానీ ఆ హీరో ఎవరు అని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఆ తర్వాత తనకు అలాంటి మరే అనుభవం ఎదురవ్వలేదని చెప్పింది నిత్యా.

Related News

Devara : దేవర స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్… టికెట్ రేట్లు ఎంతంటే?

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Big Stories

×