Nishadh Yusuf Passes Away : శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా కంగువ. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంగువ సినిమా అదే స్థాయిలో హిట్ అవుతుంది అని ఇప్పటివరకు చాలామంది సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ కి ఊహించని పరిణామం ఎదురైంది.
ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన నిషాద్ యూసఫ్ అక్టోబర్ 30 తెల్లవారుజామున మృతి చెందాడు. కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో అతని అపాయింట్మెంట్లో తెల్లవారుజామున రెండు గంటలకు అతని మృతదేహం కనిపించింది. అయితే మృతికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. నిషాద్ ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేశారు అతని వయసు 43 సంవత్సరాలు. నిషాద్ యూసుఫ్ మరణాన్ని ది ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
ఆ యూనియన్ నిషాద్ ఫోటోలు షేర్ చేసి మారుతున్న మలయాళ సినిమా యొక్క సమకాలీన భవిష్యత్తు నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఫిలిం ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనూహ్య మరణం సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. FEFKA డైరెక్టర్స్ యూనియన్ సంతాపాన్ని తెలియజేస్తుంది.