EPAPER

Jai HanuMan Producers : RKD – ప్రశాంత్ వర్మ టీం అప్… అందుకే నిరంజన్ అవుట్.. మైత్రీ ఇన్..?

Jai HanuMan Producers : RKD – ప్రశాంత్ వర్మ టీం అప్… అందుకే నిరంజన్ అవుట్.. మైత్రీ ఇన్..?

Jai HanuMan Producers : ఈ ఏడాది సంక్రాంతి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా.. కానీ, అందరి కళ్లు హనుమాన్ సినిమాపైనే. పెద్ద నిర్మాతలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు ఉంటే వాళ్లతో ఈ చిన్న నిర్మాత, చిన్న డైరెక్టర్, చిన్న హీరో మొత్తంగా ఈ చిన్న సినిమా ఎందుకు కాలు దువ్వుతుంది. అని అందరూ అనుకున్నారు. కానీ, చివరికి అన్ని పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫుల్ రన్‌లో 350 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ డైరెక్టర్ – ప్రొడ్యూసర్ హిట్ కాంబినేషన్ మళ్లీ జై హనుమాన్‌తో రిపీట్ చేసి, మ్యాజిక్ చేస్తారని అనుకున్నారు.


కానీ, కట్ చేస్తే నిన్న (మంగళవారం) జై హనుమాన్ మూవీ నుంచి అప్డేట్ పోస్టర్ వచ్చింది. దాంట్లో… ప్రొడ్యూసర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ పేరు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. ప్రైమ్ షో ఇంటర్‌టైన్‌మెంట్స్ / నిరంజన్ రెడ్డి పరిస్థితి ఏంటి..? అసలు ఏం జరిగింది అంటూ చర్చ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ – ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య జరిగిన గొడవల వల్లే ఈ కాంబో విడిపోయిందని తెలుస్తుంది. దీని వెనక మరో నిర్మాత కూడా ఉన్నాడాట. వీరి మధ్య ఏం జరిగింది..? మధ్యలో వచ్చిన నిర్మాత ఎవరు..? అనేది ఇక్కడ చూద్ధాం…

విభేదాలు వచ్చింది ఇక్కడే…


పెద్దగా హిట్స్ లేని నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కలిసి హనుమాన్ మూవీ చేశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హనుమాన్ సెంటిమెంట్ కాబట్టి.. నార్త్‌లో కూడా విడుదల చేశారు. అక్కడ RKD స్టూడియోస్ అధినేత RK దుగ్గల్ ఈ మూవీ హిందీ రైట్స్ తీసుకున్నాడు.

హనుమాన్ సెంటిమెంట్ కాబట్టి.. నార్త్‌లో కూడా ఈ మూవీ బాగా రన్ అయింది. ఫుల్ రన్ పూర్తి అయ్యే సరికి 50 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఈ లాభాలే నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య చిచ్చు పెట్టాయని సమాచారం.

రెమ్యునరేషన్ కూడా ఇష్యూనే…

హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలాగే ఏదో ఒక ప్రాంతం రైట్స్ కూడా అడిగాడట. ముందుగా తెలుగు స్టేట్స్‌లో ఓ ప్రాంతం రైట్స్ అడిగారట. అది కూదరకపోవడంతో… హిందీ రైట్స్ తీసుకుంటా అని కూడా చెప్పాడట. కానీ RKD స్టూడియోస్ అధినేత RK దుగ్గల్ హిందీ రైట్స్ తీసుకున్నాడు. అక్కడ హిట్ అయిన తర్వాత ఈ RK దుగ్గల్, ప్రశాంత్ వర్మ టీం అప్ అయ్యారట. వచ్చిన ప్రాఫిట్స్‌ను నిరంజన్ రెడ్డితో సంబంధం లేకుండా తామే షేర్ చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయంలో నిరంజన్ రెడ్డికి, ప్రశాంత్ వర్మ మధ్య చాలా గొడవలు అయినట్టు వినికిడి. ఫైనల్‌గా నార్త్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్‌ను నిరంజన్ రెడ్డితో సంబంధం లేకుండానే RK దుగ్గల్, ప్రశాంత్ వర్మ సమానంగా పంచుకున్నారట.

దీంతో విభేదాలు పీక్స్‌కి వెళ్లి పోవడంతో జై హనుమాన్ మూవీకి ప్రొడ్యూసర్లు మారిపోయారట. ఇలా ఫైనల్ గా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లేస్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వచ్చారనే ప్రచారం సాగుతుంది.

Related News

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Amaran Twitter Review : ‘అమరన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Lucky Baskhar Movie Review : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ

Ka Movie Review : ‘క’ మూవీ రివ్యూ

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

KA Movie OTT : భారీ ధరకు ‘క ‘ ఓటీటీ డీల్.. ఒకేసారి రెండిట్లో స్ట్రీమింగ్..

×