EPAPER

Ghatikachalam Teaser: మసూద కన్నా ఎక్కువ భయపెట్టేలా ఉందేంటి.. ?

Ghatikachalam Teaser: మసూద కన్నా ఎక్కువ భయపెట్టేలా ఉందేంటి.. ?

Ghatikachalam Teaser: చిన్న సినిమాలు అని తీసిపారేస్తారు కానీ, కథల విషయంలో కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలను డామినేట్ చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ మధ్య ప్రేక్షకులు కూడా  సినిమాలను చూసే విధానం కూడా మారుస్తున్నారు. సినిమా.. చిన్నదా.. పెద్దదా అని చూడడం లేదు. కంటెంట్ ఉందా.. ? మూడు గంటలు బోర్ కొట్టకుండా కూర్చోబెట్టగలుగుతుందా.. ? ఇదే చుస్తునారు. ఈ ఏడాది మొత్తం చిన్న సినిమాల హడావిడినే కనిపించింది.


ఒక డిఫరెంట్ కథతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రాబోతుంది.  చైల్డ్ ఆరిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నిఖిల్ దేవదుల. బాహుబలి చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ గా నటించి మెప్పించాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో చిన్నప్పుడు నానిలా కనిపించాడు. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు హీరోగా మారాడు. అతను హీరోగా నటిస్తున్న చిత్రం ఘటికాచలం. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని MC రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా  ఘటికాచలం టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. కౌశిక్.. ఒక టీనేజర్. కానీ, అతడు అందరిలా చలాకీగా ఉండడు. ఎప్పుడు ఏదో భయంతో  ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. దానికి కారణం.. అతని మైండ్ లో ఇంకెవరో ఉంటారు. ఆ మైండ్ లో ఉన్న వ్యక్తి ఏది చెప్తే.. కౌశిక్ అది చేయాలి. అలా చేయకపోతే బండ బూతులు తిడుతుంటాడు. ఈ విషయం కౌశిక్ ఎవరికి చెప్పినా నమ్మరు. చివరికి అతనిని ఒక సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకువెళ్లినట్లు  టీజర్ లో చూపించారు. అసలు అతను ఎవరు.. ? కౌశిక్ మైండ్ లో ఎందుకు ఉన్నాడు.. ? ఈ కుర్రాడికే అతని మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి..? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ఘటికా చలం చూడాల్సిందే.


ఇలాంటి కథలు అంతకు ముందు కూడా వచ్చాయి. మనిషి మెదడులో నుంచి ఒక వాయిస్ రావడం.. వారు చెప్పింది చేయకపోతే హింసించడం లాంటి కథలు చాలానే చూసాం. ఇక ఈ టీజర్ ను చూస్తుంటే..  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హర్రర్ చిత్రాల్లో టాప్ 10 లో నిలిచిన మసూద గుర్తుకు రాకుండా మానదు. అందులో కూడా కొత్త లోకం కోసం ఆత్మలు పోరాటం చేస్తూ ఉంటాయి.అయితే  ఇది హర్రర్ కాకపోయినా.. అందులో వచ్చే సీన్స్, మ్యూజిక్ అంతకు మించి భయపెడుతున్నాయి.

నిఖిల్.. తన నట విశ్వరూపం చూపించాడు. టీజర్ లోనే అతడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కథ నచ్చి.. స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన మారుతీ మరియు SKN ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో నిఖిల్ హీరోగా హిట్ అందుకుంటాడా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Big Stories

×