BigTV English

Niharika: నిహారిక లేటెస్ట్ ఫోటోలు.. మరి, విడాకులు?

Niharika: నిహారిక లేటెస్ట్ ఫోటోలు.. మరి, విడాకులు?
Niharika konidela

Niharika: నిహారిక కొణిదెల. మెగా డాటర్. ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండేది. ఇటీవల కంప్లీట్ సైలెంట్. ఏరికోరి చేసుకున్న భర్తతో విడిపోతోందని ప్రచారం జరుగుతోంది. చైతన్యతో విభేదాలు వచ్చాయని పుకార్లు. చైతన్య సైతం పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి డిలీట్ చేయడంతో.. వారి డైవర్స్ మేటర్ అన్‌అఫీషియల్‌గా కన్ఫామ్ చేసేశారు నెటిజన్లు.


చైతన్య నుంచి దూరం జరిగాకే.. ఆమె హుషారు తగ్గిందని అంటున్నారు. కామ్‌గా ఇంటికే పరిమితమయ్యారు. బయట ఎలాంటి ఈవెంట్స్‌లోనూ కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేరు. నిహారికాను అంతా మర్చిపోతున్నారని అనుకుంటున్న వేళ.. సడెన్‌గా ఫోటోలు షేర్ చేశారు.

ఇటీవలే తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో షేర్ చేయగా.. ఇప్పుడు ఫోటోలు పోస్ట్ చేసింది నిహారిక. మెగా డాటర్ చివరిసారిగా నవంబర్‌ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. అంటే, దాదాపు 4 నెలల తర్వాత ఆమె నుంచి వచ్చిన పిక్స్ ఇవి. లంగా ఓణీలో.. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించింది నిహారిక. ఎందుకోగానీ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ చేసింది.


నిహారిక ఫోటోలు కనిపించగానే నెటిజన్లు ఊరుకుంటారా? ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు. మీరు విడిపోతున్నారా? భర్తను ఎందుకు అన్‌ఫాలో చేశారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్ చేశాడు? మీరు మరో పెళ్లి చేసుకుంటారా? సినిమాల్లో బిజీ అవుతారా? కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసుకోవడం.. మళ్లీ విడాకులు తీసుకోవడం..ఏంటి? ఇలా రకరకాలుగా కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు. నిహారికకు సపోర్ట్‌గా నిలుస్తూ అభిమానులు నెగటివ్ పోస్టులకు కౌంటర్లు ఇస్తూ.. ఇన్‌స్టాలో రచ్చ రేపుతున్నారు.

Related News

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

Big Stories

×