EPAPER

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Love Reddy Movie Review :


సినిమా : లవ్ రెడ్డి
విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024
నటీనటులు : అంజన్ రామచంద్రన్, శ్రావణి రెడ్డి
డైరెక్టర్ : స్మరణ్ రెడ్డి
నిర్మాత : హేమలత రెడ్డి

Love Reddy Movie Rating : 1.75/5


దసరా సినిమాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వడం లేదు. అన్నీ చిన్న సినిమాలే. ఈ లిస్ట్ లో ఉన్న ‘లవ్ రెడ్డి’ కొంచెం వార్తల్లో నిలిచింది. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంది అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

ఆంధ్ర – కర్ణాటక బోర్డర్లో ఉన్న ఓ పల్లెటూరిలో నివసిస్తూ ఉంటాడు నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర). అతనికి 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లికాదు. పెద్దలు చూసే సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. తన మనసుకి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది అతని డ్రీం. ఈ క్రమంలో అతనికి దివ్య(శ్రావణి రెడ్డి) అనే అమ్మాయి తారసపడింది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు.ఎలాగోలా చేసి ఆమెతో ఫ్రెండ్ షిప్ సంపాదిస్తాడు. అలా లవ్ రెడ్డిగా మారిన అతనంటే దివ్య కూడా ఇష్టంగానే ఉంటుంది. కానీ ఒకరోజు అతను ప్రపోజ్ చేయగా రిజెక్ట్ చేస్తుంది. అది ఎందుకు? ఆ తర్వాత నారాయణ రెడ్డి ఆమె రిజెక్షన్ ని ఎలా తీసుకున్నాడు? అతని జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

కథ పరంగా చూసుకుంటే.. కొత్తదనం ఇసుమంత కూడా లేని సినిమా ఇది. అయితే దానికి ఆంధ్ర-కర్ణాటక బోర్డర్ నేటివిటీని అద్ది నేచురల్ గా చెప్పాలనుకున్న తీరు బాగుంది. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎక్స్పోజింగ్ వంటి వాటికి స్కోప్ ఇవ్వకపోవడం విషయంలో కూడా దర్శకుడిని అభినందించొచ్చు. కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎంత మాత్రం కొత్తగా ఉండదు. ప్రేమ కథ అన్నప్పుడు హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ ట్రాక్స్ బాగుండాలి. ప్రేమకథలు విషయంలో కొత్తగా అనిపించేవి అవే. డైరెక్టర్ వాటి పై దృష్టి పెట్టలేదు. క్లైమాక్స్ ను ఎమోషనల్ గా తీర్చిద్దిన తీరు ఓకే.

సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది ప్రిన్స్ హెన్రీ సంగీతం అని చెప్పాలి. గతంలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి సినిమాలకి కూడా ఇతను మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇతని టాలెంట్ ని కరెక్ట్ గా వాడుకుంటే మంచి ఔట్పుట్ వస్తుందేమో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే. కాకపోతే ఈ కథకి అంతకు మించి అవసరం కూడా ఉండదు.

నటీనటుల విషయానికి వస్తే… సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లే నటించారు. హీరో అంజన్ రామచంద్ర తన షార్ట్ ఫిలిమ్స్ నైపుణ్యంతో అనుకుంట ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించాడు. కానీ ఇంకా బెటర్ అవ్వాలి. హీరోయిన్ శ్రావణి రెడ్డి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. కానీ హావభావాలు చెప్పుకోదగిన విధంగా లేవు. సీరియల్ నటుడు ఎన్.టి.రామస్వామి తన తండ్రి పాత్రకి పూర్తి న్యాయం చేశాడు అని చెప్పాలి.గణేష్ డి.ఎస్ కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. మిగిలిన నటీనటులు సో సోగా కానిచ్చేశారు.

ప్లస్ పాయింట్స్ :

మ్యూజిక్
కామెడీ(అక్కడక్కడా)
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడం
సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్

మొత్తంగా.. ఈ ‘లవ్ రెడ్డి’ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ.. సాగే ఓ రొటీన్ లవ్ స్టోరీ. థియేటర్లలో కష్టమే.. ఓటీటీకి ఇది పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు.

Love Reddy Movie Rating : 1.75/5

Related News

Lucky Bhaskar,KA: దీపావళి సినిమాకు అమావాస్య సెంటిమెంట్

Shruthi Haasan : మరో బాయ్ ఫ్రెండ్ వేటలో శృతి… కాబోయే వాడిలో ఈ లక్షణం ఉండాలట

Sid Sriram: ఒక్క రోజు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. ఈ డిమాండ్ మాములుగా లేదుగా..?

Rewind Movie Review : రివైండ్ మూవీ రివ్యూ

Pushpa 2 : థియేట్రికల్ రైట్స్ కు భారీ ధరలు కోట్ చేస్తున్న నిర్మాతలు… చేతులెత్తేస్తున్న బయ్యర్స్

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Big Stories

×