EPAPER

Indian -2 OTT: ‘ఇండియన్ 2’ మూవీకి కొత్త సమస్య.. నోటీసులు ఇచ్చిన మల్టీప్లెక్స్!

Indian -2 OTT: ‘ఇండియన్ 2’ మూవీకి కొత్త సమస్య.. నోటీసులు ఇచ్చిన మల్టీప్లెక్స్!

Multiplex Association Takes Legal Action to Indian -2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2’. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా..జూలై 12న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా, ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. స్ట్రీమింగ్ టైమ్ లైన్ నిబంధనలను(హిందీలో) ఉల్లఘించారంటూ ఇండియన్ 2 టీంకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు జారీ చేసింది.

జూలై 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చేందుకు నిబంధనల ప్రకారం..8 వారాల సమయం ఉండాలి. అయితే ఈ సినిమా నిబంధనలకు విరుద్ధంగా ఆగస్టు 9న అందుబాటులోకి వచ్చేసింది. నెలలోపే నెట్‌ఫిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అసలు సమస్య ఎదురైంది.


ఇండియన్ 2 మూవీ నిర్మాతలకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు పంపించినట్లు ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓటీటీ విషయంలో నిబంధనలు అతిక్రమించి త్వరగా ఓటీటీలోకి ఇవ్వడం కారణంగా లైకా సంస్థకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగా అనుకున్న తేదీ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

అయితే, ఈ నిబంధనలు అతిక్రమించడం మల్టీప్లెక్స్ యూనియన్ రూల్స్‌కు విరుద్ధం. బాలీవుడ్ సినిమాలు ఏవైనా సరే.. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఖచ్చితంగా 8 వారాల గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. థియేటర్‌లో విడుదలైన తర్వాత సినిమా ప్లాప్ అయినప్పటికీ రూల్స్ పాటించాలి.

ఒకవేళ రూల్స్‌కు విరుద్ధంగా ముందే ఓటీటీలోకి విడుదల చేస్తామని నిర్ణయించుకుంటే. ఆ సినిమాలకు స్క్రీన్లు కేటాయించరు. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ తదితర కంపెనీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

ఇక, ఇండియన్ 2 సినిమా విషయానికొస్తే.. మల్టీప్లెక్స్‌లకు చెందిన ఈ నిబంధనను అతిక్రమించి హిందీ వెర్సన్ ను నెట్ ఫిక్స్‌లో 2 నెలలు పూర్తి కాకుండానే రిలీజ్ చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో లీగల్ నోటీసు పంపింది.

Also Read: నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..?

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×