Nikhil Siddhartha: పబ్లిసిటీ లేనిదే ఏ ప్రోడక్ట్ అయినా జనాల్లోకి వెళ్లదు. ఇది అన్ని రంగాల్లోకి వర్తిస్తుంది. ముఖ్యంగా సినిమాలకు ప్రమోషన్స్ అనేవి చాలా అవసరం. ఒక సినిమాను ఎప్పుడు మొదలుపెట్టాలి అన్న దగ్గరనుంచి ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ నిర్ణయిస్తారు. ఆ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చేయడమే ప్రమోషన్. ఎంత పబ్లిసిటీ ఉంటే.. సినిమాపై అంత హైప్ ఉంటుంది.
కథ రెడీ అయ్యి ఒక స్టార్ హీరోకు వినిపించాడు అన్న దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి.. చివరి ఇంటర్వ్యూ వరకు ప్రమోషన్స్ చేస్తేనే.. కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అలాంటింది అసలు సినిమా ఎప్పుడు తీశారో తెలియదు .. ? సడెన్ గా మేము సినిమాను పూర్తి చేసాం అని పోస్టర్ తో షాక్ ఇచ్చారు. సరే.. ఎలాగూ సినిమా ఫినిష్ చేశారు కదా .. ప్రమోషన్స్ మొదలుపెడతారేమో అనుకుంటే.. ఒక్కరు కూడా ఆ సినిమాను పట్టించుకున్నవారే లేరు. పోనీ అదేమైనా చిన్న సినిమా.. కొత్తగా హీరోనా.. కొత్త డైరెక్టరా.. అంటే కాదు.
Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి
పాన్ ఇండియా హీరో.. ఇప్పటికే హీరో- డైరెక్టర్ కాంబోలో మంచి హిట్ ఉంది. స్టార్ హీరోయిన్.. అన్నింటికి మించి ఒక స్టార్ ప్రొడక్షన్ హౌస్. ఇన్ని ఉన్నా కూడా ఆ సినిమాకు ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు అంటే.. ఎవరిదగ్గర సమాధానం లేదు. అరెరే.. ఇంత స్టోరీ చెప్పారు.. అసలు అదేం సినిమా.. ? ఎవరా డైరెక్టర్.. ? ఏంటా కథ.. ? అని చెప్పలేదు అనుకుంటున్నారా..? ఓకే ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం రండి.
నిఖిల్ సిద్దార్థ్.. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ .. ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ, నిఖిల్ కెరీర్ లో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ అంటే స్వామి రారా. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిఖిల్ ని హీరోగా నిలబెట్టింది. ఆ తరువాత ఈ కుర్ర హీరో వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అంటే అతిశయోక్తి కాదు.
Janvi Kapoor : దెయ్యంగా మారబోతున్న జాన్వీ కపూర్..డబ్బుల కోసం ఇంత కక్కుర్తినా..?
ఇక కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ 2, 18 పేజీస్ ఇలా మంచి విజయాలను సొంతం చేసుకొని పాన్ ఇండియా హీరోగా మారాడు. చాలా గ్యాప్ తరువాత స్వామి రారా కాంబో రీపీట్ అయ్యింది. నిఖిల్ – సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. అసలు ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టారో.. ఎప్పుడు ఫినిష్ చేశారో కూడా తెలియదు.
ఒకరోజు సడెన్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పోస్టర్ ను రిలీజ్ చేసి నవంబర్ 8 న రిలీజ్ అని ప్రకటించారు. ఫ్యాన్స్ అందరికి షాక్. హిట్ అయిన కాంబో రీపీట్ అంటే వచ్చే హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక వీరిద్దరి కాంబోలో.. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది అంటే.. ఆ అంచనాలు చాలు.. మొదటిరోజు మంచి కలక్షన్స్ రాబట్టడానికి. కానీ, అదేమీ ఈ సినిమా విషయంలో జరగలేదు. సరే షూటింగ్ అంతా అయిపోయింది. రిలీజ్ డేట్ కు ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా ప్రమోషన్స్ మీద ఫోకస్ చేయడం లేదు మేకర్స్.
Hebah Patel: ప్రేమ పెళ్లి పై అలాంటి కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..!
అసలు నిఖిల్ కు ఈ సినిమా కథనే నచ్చలేదని, అందుకే ప్రమోషన్స్ కు రావడం లేదని అంటున్నారు. ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు.. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అందులో ఈ సినిమా ఎప్పుడు తీశారు అన్న ప్రశ్నకు నిఖిల్ పోకిరి స్టైల్లో.. ఎప్పుడు తీశామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. ప్రమోషన్స్ ఈ రేంజ్ లో ఉంటే బుల్లెట్ ఎలా దిగుతుంది భయ్యా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని.. నిఖిల్ చేసిన ప్రమోషన్ ఏం లేదు. గొడవలు ఉన్నప్పుడు ప్రమోషన్స్ కు రాను అనుకున్నప్పుడు అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు.
Sunny Leone: మరోసారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ముగ్గురు పిల్లలముందే..
చిన్న సినిమానా.. ? పెద్ద సినిమానా.. ? కథ నచ్చిందా.. ? నచ్చలేదా.. ? ఇవన్నీ పక్కన పెడితే.. రిలీజ్ కు వచ్చిన సినిమాలో హీరోగా నటించిన నిఖిల్ కు ప్రమోషన్స్ చేయడం బాధ్యత. వివాదాలు వచ్చాయని ప్రమోషన్స్ చేయకుండా ఉంటే.. ఆ ప్లాప్ అతని ఖాతాలోనే ఉంటుంది. ఇది నిఖిల్ కి కొత్తేమి కాదు. స్పై సినిమా విషయం లో కూడా ఇలాగే జరిగింది. మేకర్స్ కు నిఖిల్ కి గొడవ కావడంతో సరిగ్గా ప్రమోషన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమా. స్పై కు వచ్చిన రిజల్ట్ నే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కు వస్తుందో లేదో చూడాలి.