EPAPER

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Kanguva : ఈ మధ్య తెలుగుతో పాటుగా అన్ని ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ (Kanguva) కూడా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటుగా భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుంది. గతంలో సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఈయన చివరగా రజనీకాంత్ (Rajinikanth) తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఈ సినిమా విడుదలకు కొద్దీ రోజులు మాత్రమే ఉండటం తో సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ను మేకర్స్ విడుదల చేస్తున్నారు.. భారీ యాక్షన్ కథతో రాబోతున్న ఈ మూవీ నుంచి ఒక పాటను తాజాగా సినిమాలో నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మోడ్ లో ఉంటే, ఈ రెండవ సాంగ్ మాత్రం కంప్లీట్ గా పార్టీ మూడ్ లో ఉంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ తో పాటు లవిత లోబో పాడగా, వివేకా లిరిక్స్ అందించారు. ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఉన్న ఈ క్యాచీ సాంగ్ వింటే పూనకాలు రావడం ఖాయం. అలాగే విజువల్ గా ఈ లిరికల్ సాంగ్ అదిరిపోయింది. అంతేకాదు సూర్య అల్ట్రా స్టైలిష్ మోడ్ లో అద్భుతంగా కన్పిస్తున్నాడు. అయితే లిరిక్స్ ఇంగ్లిష్ లో ఉండటం ఒకటి.. సాంగ్ లో బూతులు కూడా ఉన్నాయని, అలాగే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని వాటిని సరిచేయ్యాలని కంగువాకు షాక్ ఇచ్చింది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాంతో దారుణమైన ట్రోల్స్ ను కూడా అందుకుంటుంది.. యాక్షన్ సినిమా పేరుతో బోల్డ్ సీన్లు బూతులు చూపిస్తారా అని ట్రోల్స్ వస్తున్నాయని తెలుస్తుంది.

Negative trolls on Yolo song.. Suriya fans in shock..


ఇక ఈ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో కేవలం ఒక వెర్షన్ ని మాత్రమే చూపించారని. రెండవ వెర్షన్ ని ఇప్పటి వరకు అభిమానులకు చూపించలేదని, ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుందని,ఇలాంటి కాన్సెప్ట్ తో ఈమధ్య కాలం లో సినిమా రాలేదని అంటున్నారు. మరి ఈ రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం స్టూడియో గ్రీన్ సంస్థ దాదాపుగా 300 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాను కొద్ది రోజులు మాత్రమే వాయిదా వేశారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు అక్టోబర్ నుంచి సినిమా నవంబర్ కి వెళ్ళింది కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక కొందరు స్పందిస్తూ సినిమా లేట్ అవ్వచ్చు కానీ సినిమా అరాచకం మాత్రం అంతే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలి అని కూడా కొందరు నమ్ముతున్నారు. తెలుగులో బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ నుంచి అదే స్థాయి ఇంపాక్ట్ ను కంగువ సినిమా క్రియేట్ చేస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఎలాంటి టాక్ ను ట్రోల్స్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

Pottel Controversy : క్యాస్టింగ్ కౌచ్ పై అనన్యకు ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ కంప్లయింట్

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Big Stories

×