BigTV English

NBK 107 : బాల‌కృష్ణ కోసం వాలంటీర్‌గా ముందుకొచ్చిందెవ‌రు?

NBK 107 : బాల‌కృష్ణ కోసం వాలంటీర్‌గా ముందుకొచ్చిందెవ‌రు?

NBK 107 : సినిమా అంటే హీరో, హీరోయిన్‌, డైర‌క్ట‌ర్ మాత్ర‌మే కాదు. 24 క్రాఫ్ట్స్ క‌లిసి ప‌నిచేయాలి. చేసే ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను న‌మ్మాలి. సినిమా హిట్ అవుతుంద‌ని కాన్ఫిడెంట్ గా న‌లుగురికీ చెప్పాలి. అప్పుడే ఆ సినిమాను చూడాల‌న్న ఆస‌క్తి న‌లుగురిలోనూ క‌లుగుతుంది. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఆయ‌న టెక్నీషియ‌న్లు అంద‌రూ ముందుకొస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మాస్ పాట‌ల్లో ఇది మ‌రో రేంజ్ అంటూ సోష‌ల్ మీడియాలో పాజిటివ్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు రామ‌జోగయ్యశాస్త్రి. అఖండ‌కు ఏమాత్రం తీసిపోని సినిమా అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు త‌మ‌న్‌. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మాట్లాడారు స్టార్ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా.


నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో మాస్ డైలాగుల‌కు అస‌లు కొద‌వ ఉండ‌ద‌ని అన్నారు సాయి మాధవ్ బుర్రా. అంతే కాదు, అద్భుత‌మైన భావోద్వేగాలున్న సినిమా అని అన్నారు. ఇలాంటి మాస్ డైలాగులు, భావోద్వేగాలున్న క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు అరుదుగా పుడ‌తాయ‌ని చెప్పారు. చాలా డైలాగుల‌ను ఫ్యాన్స్ అస‌లు ఎక్స్ పెక్ట్ చేయ‌ర‌ని, ఒక్క‌సారి విన్నాక జీవిత‌కాలం మ‌ర్చిపోర‌ని చెప్పారు. 2023 సంక్రాంతికి విడుద‌ల కానున్న వీర సింహారెడ్డి కోసం ఫ్యాన్స్ తో పాటు తాను కూడా ఎంతో ఆస‌క్తిక‌రంగా వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పారు బుర్రా సాయిమాధ‌వ్‌. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా వీర‌సింహారెడ్డి. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించారు. శ్రుతిహాస‌న్ నాయిక‌గా న‌టించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీ రోల్ లో క‌నిపించారు. ఈ సినిమా గురించి స‌ర్వ‌త్రా పాజిటివ్ టాక్ ఉంది. సంక్రాంతి సీజ‌న్ నార్మ‌ల్‌గానే బాల‌య్య‌కు బాగా క‌లిసొస్తుంది. ఈ ఏడాది కూడా అదే స‌క్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×