Nayanatara.. సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార (Nayanatara)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 ఏళ్లకు పైగానే అవుతున్నా ఇప్పటికీ ఆమె అదే హోదాను సొంతం చేసుకోవడం నిజంగా ఆమె నటనకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ తన స్థానాన్ని మాత్రం ఆమె చెరపకుండా అదే కంటిన్యూ చేస్తోంది. ఇకపోతే నయనతార ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ్ తో పాటు హిందీ ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.
నయనతారపై సీనియర్ నటి కామెంట్స్..
ఇలాంటి ఈమెపై ఒక యంగ్ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి శరణ్య పొన్వన్నన్ (Saranya ponvannan).ఈమె పేరు చెప్పగానే నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుకొస్తుంది. తన అమాయకత్వంతో కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది శరణ్య . అంతే కాదు ఎన్నో చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆమె నటించే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ సినిమాలో అయితే తల్లి క్యారెక్టర్ లో నటించి అందరినీ ఏడిపించేసింది. అందుకే ఏ పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తుంది శరణ్య. ఈ నేపథ్యంలోనే ఈమెకు అవకాశాలు కూడా భారీగానే తలుపు తడుతున్నాయి. ఇలాంటి శరణ్య తాజాగా నయనతారపై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
నయనతార గురించి శరణ్య మాట్లాడుతూ.. నటి నయనతార ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. అయితే ఆమె అలా మాట్లాడకపోవడం వల్ల కొంతమంది చెడ్డ వ్యక్తి అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఆమె ఎంతో మంచి మనసున్న అమ్మాయి. చాలా స్వీట్ గా ఉంటుంది. జెన్యూన్ గా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం ఆమెకు తెలియదు. అంతేకాదు ఒక ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని మనిషి అంటే ఆమె ఎంత అమాయకురాలో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు సమస్య వచ్చిందంటే పది అడుగుల దూరం వెళుతుంది. ధైర్యంగా ముందుకు రాదు. ఈ విషయం ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తమిళ చిత్ర సీమలో ఈ స్థాయి నటి పవర్ ఫుల్ గా ఉండాలి కానీ నయనతార మాత్రం అలా ఎప్పుడూ ఉండదు.. చాలా మెతక మనిషి అంటూ తెలిపారు శరణ్య.
నయనతార పై యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్..
శరణ్య నయనతార మంచితనం చూసి ఆమె గొప్పగా చెప్పితే , నయనతార యాంటీ ఫ్యాన్స్ మాత్రం నయనతార పిరికిది అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నయనతారపై శరణ్య చేసిన కామెంట్లకు ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నయనతార ఇప్పటి లాగే ఎప్పటికీ తన ఇమేజ్ను కోల్పోకుండా కాపాడుకోవాలని కూడా చెబుతున్నారు.