EPAPER

Nani – Film Fare Awards 2024: ఆ కోరిక మెల్ల మెల్లగా తగ్గిపోతుంది: నేచురల్ స్టార్ నాని

Nani – Film Fare Awards 2024: ఆ కోరిక మెల్ల మెల్లగా తగ్గిపోతుంది: నేచురల్ స్టార్ నాని

Film Fare Awards 2024: సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్మాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ఇవాళ అట్టహాసంగా జరిగింది. ఇందులో సౌత్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమకు చెందిన నటీ, నటులు, సంగీతకారులు, దర్శకులతో సహా ఇతర నిపుణులు పాల్గొన్నారు. ఈ అవార్డుల వేడుకల్లో ఊహించిన విధంగానే నేచురల్ స్టార్ నాని సత్తా చాటాడు.


‘దసరా’ చిత్రానికి గానూ నాని బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ధరణి పాత్రలో అతడి నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దసరా మూవీ కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. అలాగే ఈ మూవీలో బెస్ట్ విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ సత్యన్‌ సూర్యన్‌ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.

అంతేకాకుండా సినిమాలోని అద్భుతమైన సెట్స్‌కు గానూ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇందులోని ధూమ్ ధామ్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా ఉన్న ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకున్నాడు. ఇలా ఈ సినిమా నుంచి చాలా అవార్డులు అందుకున్న అనంతరం నేచురల్ స్టార్ నాని మాట్లాడాడు.


Also Read: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాని!

‘‘ఒకప్పుడు మనం కూడా ఏదో ఒక రోజు చాలా అవార్డులు గెలుచుకోవాలని ఆ కోరిక ఉండేది బలంగా. కానీ మెల్ల మెల్లగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అవార్డుల విషయం అంత కోరిక లేదు. ఇప్పుడున్న కోరిక ఏంటంటే.. నా డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, నా సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్లు, ప్రొడక్షన్‌లో ఇంటర్‌డ్యూస్ అయిన కొత్త టాలెంట్ ఉన్న వారు. ఇలా వాళ్లందరూ అవార్డులు తీసుకుంటుంటే కూర్చుని చూడాలని ఉంది. ఆ కోరికే ఇప్పుడు నాలో గట్టిగా ఉంది. నిజంగా ఇవాళ నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఈ స్టేజ్‌మీదకొచ్చింది ఈ అవార్డు కోసం కాదు.

శ్రీకాంత్ (దసరా మూవీ డైరెక్టర్), శౌర్యువ్ (హాయ్ నాన్న డైరెక్టర్) అవార్డు తీసుకుంటుంటే చూడాలని అనుకున్నాను. కానీ వాళ్లందరికీ అవార్డు ఇచ్చే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది. దర్శకులు శ్రీకాంత్, శైర్యువ్‌ల విజయాలను పురష్కరించుకుని అవార్డు కార్డులను ఫ్రేమ్ కట్టించేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఎంతో మంది ఆర్టిస్టులు గానీ, టెక్నీషియన్లు గానీ, ఇతర ఎవరైనా మీరు చేరవలసిన ప్లేస్‌కి చేరడానికి నేను మీ జర్నీలో ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ అయ్యానంటే అదే నాకు ఒక పెద్ద అవార్డు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Related News

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×