EPAPER

Narudi Brathuku Natana: మేమే సినిమా టికెట్ ఇస్తాం, చూసి నచ్చితే ఒకటి ట్వీట్ వేయండి

Narudi Brathuku Natana: మేమే సినిమా టికెట్ ఇస్తాం, చూసి నచ్చితే ఒకటి ట్వీట్ వేయండి

Narudi Brathuku Natana: ఈ రోజుల్లో గొప్ప సినిమా తీయడం అనేది మేటర్ కాదు. ఆ గొప్ప సినిమాని ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లటం అసలైన మేటర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు వచ్చినపుడు వాటికి సరైన గుర్తింపు రాదు. ఆ సినిమాలు సరైన రిలీజ్ కి నోచుకోక ఓ టి టి లో వచ్చిన తర్వాత కొంతమంది చూసి, ఆ సినిమా గురించి పోస్ట్ చేయటం. ఆ తర్వాత ఇంకొంతమంది చూసి మరికొందరికి చెప్పడం. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఆయా సినిమాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలకు జరిగింది. అయితే ఇలాంటి కాన్సెప్ట్ బేస్ సినిమాలన్నీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తే ఆ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా నరుడు బ్రతుకు నటన. శివ హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ప్రేక్షకుల వద్దకు చేరలేదు.


ఇక ఈ సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లేందుకు ఏకంగా టిక్కెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడానికి రెడీ అయింది చిత్ర యూనిట్. ట్విట్టర్ వేదిక ఈ సినిమా హీరో ఒక వీడియో షేర్ చేశాడు. మామూలుగా ఒక సినిమాను చూడాలి అంటే ట్విట్టర్లో ట్వీట్స్ చూసి, అలానే ఆ సినిమాకు వచ్చిన రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్తాము. కానీ నేను నటించిన నరుడు బ్రతుకు నటన సినిమాకి అసలు గట్టిగా చూస్తే 50 ట్వీట్స్ కూడా లేవు. మేము సినిమాకు సంబంధించిన టికెట్స్ వందమందికి ఫ్రీగా ఇస్తాము. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని పెడితే మేము టికెట్ పంపిస్తాము. సినిమా మీకు ఒకవేళ నచ్చినట్లయితే ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ట్వీట్ వేయండి అంటూ తెలిపారు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని మూవీ టీమ్స్. అయితే ఆ చిత్ర యూనిట్ కి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కొన్ని రోజులు వేచి చూస్తే గాని చెప్పలేము.

ఇక నరుడు బ్రతుకు నటన సినిమా కథ విషయానికి వస్తే.. సత్య (శివ) బాగా డబ్బులున్న వ్యక్తి. తండ్రి సంపాదించిన దాంతో ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతుంటాడు. సత్య చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడు. తండ్రి పేరు అడ్డు పెట్టుకుని ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్తాడు. కానీ ఎక్కడా సెలెక్ట్ కాడు. ఇంటా, బయట సత్యకి అవమానాలు ఎదురవుతాయి.అసలు నటుడు అవ్వాలంటే.. ముందు మనిషిలా మారాలి.. ఎమోషన్స్ గురించి తెలుసుకోవాలని సత్య స్నేహితుడు (వైవా రాఘవ్) చెబుతాడు. దీంతో సత్య ఏదో తెలుసుకునేందుకు భాష రాని, తెలియని చోటకు వెళ్తాడు. అలా కేరళకు వెళ్లిన సత్యకి డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు. భాష తెలియకపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసాడు.? చివరకు సత్య అయ్యాడా లేదా.? అనుకున్న సాధించాడా లేదా అనేది ఈ సినిమా కథ.

Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×