EPAPER

Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి నాని లేటెస్ట్ రూ.100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి నాని లేటెస్ట్ రూ.100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saripodhaa Sanivaaram OTT: ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ వరుస హిట్లు అందుకున్నారు. అలా పలు హిట్లతో స్టార్ హీరోగా మారిపోయాడు. తన యాక్టింగ్, వాయిస్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో తన రూటే సపరేటు. ఎందుకంటే సినిమా తీసే ప్రతి ఒక్క హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తారు. ఇక చిన్న హీరోలు అయితే సినిమా హిట్ అయితే చాలు అనుకుంటారు. కానీ నాని అలా కాదు. ‘వచ్చాడు.. కొట్టాడు.. పోయాడు’ అన్నట్లు ఉంటాడు.


సైలెంట్‌గా వచ్చి వైలెంట్ బ్లాక్ బస్టర్‌ను కొట్టడంలో నానికి మించినవారు లేరనే చెప్పాలి. ఆయన లక్కో లేక స్టోరీ సెలక్షనో లేక దర్శకుల మీద నమ్మకమో ఏమో కానీ కొత్త దర్శకులతో సినిమాలు తీసి ఊహించని హిట్లు అందుకుంటున్నాడు. గతేడాది ఏకంగా రెండు సినిమాలు తీయగా అందులో ఒక సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. మరో సినిమా రూ.80 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అతడి లేటెస్ట్ మూవీ రూ.100 కోట్లతో బాక్సాఫీసును షేక్ చేసింది.

‘ఈగ’, ‘దసరా’ తర్వాత నేచురల్ స్టార్ నాని మూడవ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సరిపోద శనివారం’ నిలిచింది. ఇటీవల ఆయన నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల రూపాయల వసూళ్లకు చేరువైంది. దీంతో నాని అండ్ సరిపోదా శనివారం మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్యతో కలిసి ఆయన కుమారుడు కల్యాణ్ దాసరి నిర్మాతలుగా ఉన్నారు.


Also Read: ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఇంట్లో కూడా.. జానీ మాస్టర్‌‌ కేసులో సంచలన నిజాలు

అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య పోలీస్ పాత్రలో దుమ్ము దులిపేశాడు. ఇందులో నాని, సూర్యల మధ్య సన్నివేశాలు సినీ ప్రియుల్ని బాగా అలరించాయి. ముఖ్యంగా నాని కంటే సూర్య యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. ఇన్స్పెక్టర్ దయా పాత్రలో సూర్య నటించి అదరగొట్టేశాడు. అలాగే జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక థియేటర్లలో ఓ రేంజ్‌లో ఈ సినిమా అలరించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. థియేటర్లలో విజిల్స్ వేయించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలిపింది. అంటే ఇంకో 10 రోజులు మాత్రమే ఉందన్నమాట. అందువల్ల ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×