EPAPER

Saripoda Shanivaram: నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టింది..సరిపోదా ఈ కలెక్షన్

Saripoda Shanivaram: నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టింది..సరిపోదా ఈ కలెక్షన్

Nani Saripoda Shanivaram move solved break even In Overseas collections: ఒక పక్కరెండు తెలుగు రాష్ట్రాలలో వానలు దంచికొడుతున్నాయి. మొన్న గురువారం విడుదలైన నాని సినిమా సరిపోదా శనివారం కలెక్షన్లపై వర్షం ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. అటు వర్షాలు పడుతునే ఉన్నాయి..ఇటు నాని సినిమాకు కలెక్షన్లు వస్తునే ఉన్నాయి. రోజురోజుకూ ప్రేక్షకుల ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సినిమా లాభాల బాట పట్టిందని నిర్మాతలు ట్విట్టర్ వేదికగా పోస్టర్లు విడుదల చేశారు. వియ్ హావ్ హిట్ బ్రేక్ ఈవెన్..థాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ పై నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు గా రిలీజ్ చేశారు.
నాని, సీనియర్ నటుడు ఎస్ జే సూర్య ఈ మూవీలో పోటీ పడి నటించారు. ఇద్దరి పాత్రలకూ మంచి రెస్పాన్స్ వస్తోంది థియేటర్లలో. ఆర్ఆర్ఆర్ మూవీని నిర్మించిన డీవీవీ దానయ్య సరిపోదా శనివారం మూవీని నిర్మించారు. సినిమా ప్రమోషన్లకు తగ్గట్లుగా విడుదలయిన తొలి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.


రూ.60 కోట్ల దిశగా

తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం రూ.50 కోట్లు దాటి రూ.60 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన సరిపోదా శనివారం థియేటర్లలో 58 శాతం పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది. వానలు తగ్గితే ఈ జోరు మరింతగా పెరుగుతుందని..తప్పకుండా సరిపోదా శనివారం రూ. 100 కోట్ల మార్కును అవలీలగా దాటేస్తుందని సినీ మేధావులు చెబుతున్నారు. కేవలం ఒక్క భారత్ లోనే మూడు రోజుల్లో వసూల్లు చేసిన నెట్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి రోజు రూ.9 కోట్లు, రెండో రోజు రూ.5.85 కోట్లు, మూడో రోజు రూ.9.15 కోట్లు వసూల్లు చేసి మొత్తం రూ.24 కోట్లు వసూల్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.


ఎస్ జే సూర్య గురించే..

ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే తొలి రోజు రూ.24 కోట్లు, రెండో రోజు రూ.15 కోట్లు ,మూడో రోజు రూ.13 కోట్లు కొల్లగొట్టి 52 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుని ఈజీగా రూ.50 కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని అన్ని భాషల్లో విడుదల చేసినట్లయితే ఈ చిత్రం కలెక్షన్లు ఎప్పుడో వంద కోట్లు దాటి ఉండేవని అంటున్నారు సినీ వర్గాలు. తెలుగు, ఓవర్సీస్ లో వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఇప్పుడు మిగిలిన భాషల్లోకి కూడా సరిపోదా శనివారం మూవీని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా హిట్ లో భాగంగా మారిన దర్శకుడు ఎస్ జే సూర్య గురించే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది.

విలన్ గా సెటిల్

ఒకప్పుడు కుషీ వంటి సూపర్ హిట్ ని పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ఎస్ జే సూర్య మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. కమర్షియల్ గా స్పైడర్ విజయం సాధించకపోయినా సూర్య నటనను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. శాడిజం కలబోసిన విలన్ గా సూర్య ఆ మూవీలో తన విశ్వరూపం చూపాడు. అక్కడినుంచి సూర్యకు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలే వస్తున్నాయి. తర్వాత విజయ్ హీరోగా నటించిన మెర్సెల్, మార్క్ అంటోనీ, ానాడు, జిగర్తాండ డబుల్ ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలన్నింటికీ విలన్ గా ప్రాణప్రతిష్ట చేశాడు. ఒక్కో సినిమాలో హీరోని కూడా డామినేట్ చేసే పాత్రలు లభించడంతో ఎస్ జె సూర్య రెచ్చిపోతున్నాడు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×