EPAPER

Tarakaratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం..

Tarakaratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం..

Tarakaratna: సినీనటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 23 రోజుల పాటు వెంటిలేటర్‌పై పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన కోలుకోవాలని ఎంతగానో ప్రార్థించిన కుటుంబ సభ్యులు, అభిమానులకు నిరాశే మిగిలింది.


తారకత్న మరణంతో సినీఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిగిపోయింది. ఆయన మృతిపట్లు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆదివారం ఉదయం తారకరత్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మోకిలలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు.

సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం తారకరత్న మృతదేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


జనవరి 28న కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. విదేశాల నుంచి వైద్యులను రప్పించి చికిత్స అందించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూశారు.

Taraka Ratna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. ఇదీ ఆయన ప్రస్థానం..

Kangana Ranaut : రాజ‌మౌళికి కాంట్ర‌వ‌ర్సీ కంగ‌నా స‌పోర్ట్‌..

Tags

Related News

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Big Stories

×