EPAPER

Kalyan Ram: బాలయ్యతో పోల్చకండి.. తారక్ కంటతడి పెట్టించాడు: కళ్యాణ్ రామ్

Kalyan Ram: బాలయ్యతో పోల్చకండి.. తారక్ కంటతడి పెట్టించాడు: కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram inspired acting from Balakrishna, jr.Ntr: బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన కళ్యాణ్ రామ్ నటుడిగానే కాదు నిర్మాతగానూ నిరూపించుకున్నారు. 1989లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో కళ్యాణ్ రామ్ బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. అయితే కొంతకాలం బ్రేక్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2003లో వచ్చిన ‘తొలి చూపులోనే’ మూవీతో హీరో అయ్యారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ అవడం ప్రారంభమయ్యాయి. అభిమన్యు, విజయదశమి, కత్తి ఇలా అన్ని సినిమాలూ వరుసగా అపజయం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు కళ్యాణ్ రామ్.


ధైర్యమిచ్చిన తండ్రి

అదే సమయంలో తండ్రి హరికృష్ణ కళ్యాణ్ రామ్ కి ధైర్యం ఇచ్చారు. ఓటమి ఎప్పుడూ విజయాలకు మెట్లవుతాయని చెప్పేవారట. అదే ధైర్యంతో ముందడుగు వేశారు కళ్యాణ్ రామ్. తండ్రి అనుమతి తీసుకుని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి తానే హీరోగా ‘అతనొక్కడే’ మూవీ తీసి..అందులో తానే హీరోగా నటించారు. ఆ సినిమాకు అప్పుడే కొత్తగా వచ్చిన సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ఖిలాడీ, అశోక్, అతిథి, ఊసరవెల్లి, సైరా నరసింహరెడ్డి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ద్వారా నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ వచ్చారు.‘ పటాస్’ మూవీ ద్వారా అనిల్ రావిపూడిని పరిచయం చేశారు. ‘బింబిసార’మూవీతో మల్లిడి వశిష్టను దర్శకుడిగా తీసుకొచ్చారు. ప్రస్తుతం వశిష్ట చిరంజీవి ‘విశ్వంభర’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.


Also Read: దేవర ముందు ఈ రీ-రిలీజుల గోల ఏంటి? ఏకంగా నాలుగా?

రెండు భాగాలుగా దేవర

తన సొంత బ్యానర్ స్థాపించి కిక్ 2, జై లవకుశ, ఇజం, అతనొక్కడే వంటి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. హరికృష్ణకు రెండో భార్య కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. అయినా సరే ఇద్దరూ సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగానే అభిమానించుకుంటారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది. అయితే ఆశించిన విజయం దక్కలేదని ఈ సారి ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమా తీయాలని భావించి దేవర మూవీని రెండు భాగాలుగా అందిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లలో దూసుకుపోతోంది.

వారితో పోల్చకండి

దేవర చిత్ర నిర్మాతగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కళ్యాణ్ రామ్. దేవర లాంటి సినిమా మీరే చేయొచ్చుకదా అని..బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలతో కళ్యాణ్ రామ్ సినిమాలను పోల్చగా..‘దయచేసి వారితో నన్ను పోల్చకండి. బాబాయ్ బాలకృష్ణ ఓ లెజెండ్ ఆయన ఈ వయసులోనూ అంత ఎనర్జిటిక్ గా నటించడం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడిచ్చిన వరం ఆయనకు. నటనే ఆయన బలం. అలాగే తమ్ముడు ఎన్టీఆర్ కూడా చాలా గొప్ప నటుడు. ఆర్ఆర్ఆర్ మూవీలో నిజంగానే కంట తడిపెట్టించేశాడు. అలాంటి సినిమాలను నేను చేయలేను. వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది. ఎలాంటి పాత్రలైనా వాళ్లు చేయగలరు. ఇక నందమూరి హీరోల మధ్య ఉన్నది పోటీ కాదు..కేవలం స్ఫూర్తి. ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందుతామని కళ్యాణ్ రామ్ అన్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×