Namitha: ఈ మధ్య హీరోయిన్లు స్లిమ్ గా కనిపించాలని డైట్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే జిమ్ లకు వెళ్తూ ఏదొక విధంగా సన్నగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవ్వగా మరికొంత మంది ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది బొద్దుగా ఉండే హీరోయిన్ల కు కూడా వరసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే హీరోయిన్, స్టార్ హీరోల సరసన జోడిగా నటించిన నమిత పేరు అందరికి తెలిసే ఉంటుంది. ఈమె ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేసినట్లు లేదు.. బొద్దుగా ఉండే నమిత అర్ద రాత్రులు ఆ పని చేసి మీడియాకు దొరికిందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆమె ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
హీరోయిన్ నమిత తెలుగు లో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె తెలుగులో సొంతం,జెమిని,ఓ రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమకథ, బిల్లా వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే నటించింది. అలా తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా మారిపోయిన నమిత గురించి ఆ మధ్య వార్తల్లో ఓ విషయం హైలెట్ అయ్యింది. అదేంటంటే ఆమె రోజు అర్ద రాత్రి బయటకు వెళ్లి ఓ పని చేసెదట.. అది ఒకరోజు మీడియకు తెలియడంతో ఈ వార్త బయటకు వచ్చింది.. అప్పట్లో తెగ వైరల్ అయ్యింది కూడా.. అసలు ఆమె ఏమి చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
నమిత ఆమె ఉండే ఊరిలోని ఊరి చివర బంగ్లాకి అర్ధరాత్రి పూట వెళ్లేదట.. రోజు అలా వెళ్ళేది. ప్రతిరోజు ఇలా నమిత వెళ్లడం చూసి కొంతమంది మీడియా వాళ్ళు ఈమె ఎక్కడి కి వెళ్తుంది ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా నమిత ఆ ఊరి చివర బంగ్లాలో ఏం చేస్తుందో తెలుసుకున్న మీడియా వాళ్ళు షాక్ అయ్యారు. నిజానికి ఆ బంగ్లాలో ఆమె డ్యాన్స్ చేస్తూ ఉండేదట.. నమిత సన్నగా తయారయ్యి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం సాల్సా డ్యాన్స్ నేర్చుకుందట. అలా ఇంట్లో కాకుండా వెరైటీగా ఊరి చివరలో ఉండే ఒక బంగ్లాలో ఓ టీచర్ సహాయం తో సాల్సా డ్యాన్స్ నేర్చుకుని సన్నబడిందట.. ఈ విషయం పై మీడియా వాళ్ళు చేసిన ఆపరేషన్ వల్ల బయటపడింది. ఇన్నాళ్ల కు మళ్లీ ఈ వార్త బయటకు వచ్చింది. ఇకపోతే ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీని లీడ్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే ఈమె బుల్లి తెర పై ప్రసారం అయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహారిస్తూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది..