Big Stories

Akkineni Nagarjuna Political Entry : పొలిటికల్ ఎంట్రీపై నాగ్ అసలు అభిప్రాయమిదే!

- Advertisement -

Akkineni Nagarjuna Political Entry : అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. విజయవాడ ఎంపీ స్థానం నుంచి నాగార్జున పోటీ చేయనున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. తాను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు నాగ్. మంచి కథ వస్తే మాత్రమే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానన్నారు.

- Advertisement -

సుమారు రెండు దశాబ్దాల నుంచి నాగార్జున… చిరంజీవిలా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే టాక్ వినబడుతోంది. అయితే దానిపై నాగ్ ఇప్పటికి క్లారిటీ ఇచ్చినట్లయింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. సినిమా టికెట్ రేట్ల సమస్య వచ్చినప్పుడు స్వయంగా సీఎం జగన్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దిన వారిలో నాగార్జున ఒకరు.

అయితే నాగార్జున ఓటీటీలపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. ఓ ఆరు నెలల వరకు ఏ సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకొని ఓటీటీపైన దృష్టిపెడతానన్నారు. ప్రేక్షకులు ఓటీటీకు ఎందుకు ఆకర్షితులయ్యారు… ఓటీటీలో భారీ సక్సెస్‌కు కారణం ఏంటీ అనే విషయాలపై అవగాహన పెంచుకుంటానన్నారు నాగార్జున. మంచి అవకాశం వస్తే ఓటీటీలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు నాగార్జున.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News