EPAPER

Nagendran’s Honeymoons Review: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాళ వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్

Nagendran’s Honeymoons Review: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాళ వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే  వేరే లెవెల్

Nagendran’s Honeymoons Review: ఈ మధ్య మలయాళ మేకర్స్.. ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త కొత్త కథలతో వస్తున్నారు. ఈ ఏడాది అంతా మలయాళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా సంతృప్తి చెందారు. ఇప్పటికే మలయాళం నుంచి వచ్చిన ప్రేమలు, భ్రమయుగం, గోట్ లైఫ్, ఆవేశం, మంజుమ్మేల్ బాయ్స్ లాంటి సినిమాలు థియేటర్ లో హిట్స్ అందుకున్నాయి.


ఇక ఓటీటీలో కూడా మలయాళ మేకర్స్ తమ సత్తా చాటుతున్నారు. అబ్రహం ఓజ్లర్, అన్వేషిప్పిన్ కండెతుమ్, గురువాయూర్ అంబలనాదయిల్ సినిమాలు ఓటీటీలో తెలుగు వెర్షన్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తాజగా మరో మలయాళ వెబ్ సిరీస్ ఓటీటీలో సత్తా చాటుతోంది. అదే నాగేంద్రన్’స్ హనీమూన్.

నితిన్ రేంజి పనికర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో మలయాళ నటుడు సూరజ్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.రిలీజ్ అయిన దగ్గరనుంచి హాట్ స్టార్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అసలు నాగేంద్ర కథ ఏంటి.. ? అనేది తెలుసుకుందాం రండి.


కథ:

నాగేంద్ర.. ఏ పనిపాట చేయకుండా తిని పడుకొనే సోమరి. తల్లి తీసుకొచ్చి పెడితే తినడం.. లేకపోతే తన ఫ్రెండ్ సోమా దగ్గర డబ్బులు తీసుకొని తినడమే పని. కానీ, తల్లికి మాత్రం.. కొడుకు పనిచేసి.. తన మేనకోడలు అయిన జానకితో పెళ్లి చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. నాగప్ప మాత్రం.. కువైట్ కు పోయి డబ్బు సంపాదించి ఊరికి వచ్చి షోలు చేయాలనీ కలలు కంటూ ఉంటాడు. అలాంటప్పుడే కువైట్ నుంచి నాగప్ప ఫ్రెండ్ ఊరు వస్తాడు. అతడికి నాగప్ప సాయం చేయడంతో తనను కువైట్ పంపిస్తానని, వీసాకు డబ్బులు కూడబెట్టుకోమని 3 నెలలు టైమ్ ఇస్తాడు.

చేతిలో చిల్లిగవ్వ కూడా లేని నాగప్ప డబ్బు కోసం అందరిని అడుగుతాడు. కానీ, డబ్బు పుట్టకపోవడంతో.. సోమా చెప్పిన ఐడియాను ఫాలో అవుతాడు. తన మరదలు జానకిని పెళ్లి చేసుకుంటే.. వరకట్నం కింద డబ్బు వస్తుందని చెప్పడంతో అలానే చేస్తాడు. కానీ, మరదలి నుంచి డబ్బు రాదు. ఇక ఇదే ప్లాన్ ను అమలు చేసుకుంటూ.. అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ వరకట్నాలు తీసుకొని డబ్బు దాచుకుంటాడు. మరి చివరికి నాగేంద్ర ఆ డబ్బుతో కువైట్ వెళ్లాడా.. ? పోలీసులు అతనిని అరెస్ట్ చేశారా.. ? చివరికి సోమా అనుకున్నది జరిగిందా.. ? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలనీ అంటారు. ఇక్కడ నాగప్ప.. అన్ని అబద్దాలు ఆడి పెళ్లి చేసుకొని పారిపోతాడు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి చేసుకోవడానికి నాగప్ప ఎన్నని ఇబ్బందులు పడ్డాడు అన్నదాని కన్నా.. అక్కడ నుంచి ఎలా పారిపోయాడు అనేది ఎంతో కామెడీగా చూపించారు. అంతేకాకుండా డబ్బు కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అనేది చివర్లో చూపించారు.

నమ్మినవాళ్లు మోసం చేసినప్పుడు ఉండే బాధ.. పెళ్లి కావాల్సిన అమ్మాయి తల్లిదండ్రులు ఎంతలా బాధపడతారో.. పెళ్లి కావడం లేదని, పెళ్లి కొడుకు వివరాలు కూడా సరిగ్గా తెలుసుకోకుండా పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం ఈ సిరీస్ లో దర్శకుడు చాలాబాగా చూపించారు. 6 ఎపిసోడ్స్ కు అమ్మాయిల పేర్లు పెట్టుకుంటూ వచ్చారు.

జానకి, సావిత్రి, తంగమ్, మోళి, లైలా.. వారి జీవితాలు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే అమ్మాయిల లైఫ్ విన్నప్పుడు.. నాగప్ప చేస్తున్న పనికి తప్పుగా అనిపించదు. కానీ, ఎప్పుడైతే నాగప్ప రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో .. అప్పుడు అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అది సిరీస్ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు.

నటీనటులు:

నాగేంద్రగా సూరజ్ నటన అద్భుతం. ఇక 6గురు పెళ్లి కూతుళ్లుగా.. కని కస్తూరి, గ్రెస్ ఆంటోనీ, అమ్ము అభిరామి, శ్వేతా మీనన్, నిరంజన అనూప్.. వారి పాత్రల మేరకు నటించారు. ముఖ్యంగా కని కస్తూరి వేశ్యగా కనిపించింది. భర్తను పక్కన పెట్టుకొని వ్యభిచారం చేస్తూ కూడా ఎలాంటి ఫీల్ లేకుండా ఉండడం, మధ్యలో నాగప్ప తల్లి గురించి మాట్లాడడం ఆకట్టుకుంటుంది.

ఇక సోమా పాత్ర మెయిన్ హైలైట్. ప్రశాంత్ అలెగ్జాండర్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. తన స్వార్థం కోసం నాగప్పలాంటి ఒక వెర్రిబాగులోడిని ఆటబొమ్మలా వాడుకున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. వెల్లయని బ్యాక్‌డ్రాప్‌గా ఈ సిరీస్ జరుగుతుంది. 1978 నాటి కాలంలో జరిగే కథ కావడంతో.. అప్పటి వ్యవహార శైలిని బాగానే చూపించారు. అక్కడక్కడ బోర్ కొట్టినా కూడా పర్లేదు చూడొచ్చు.. నాగప్ప వారి నుంచి ఎలా తప్పించుకుంటాడు అనే క్యూరియాసిటీ ఉంటుంది.

ట్యాగ్ లైన్: టైటిల్ లో తప్ప సిరీస్ లో లేని హనీమూన్

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×