EPAPER

Bigg Boss Season 8: నాగార్జున షూటింగ్ కంప్లీట్.. కంటెస్టెంట్ లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరు ఫేమస్ లేడీలు లేనట్లేనా..?

Bigg Boss Season 8: నాగార్జున షూటింగ్ కంప్లీట్.. కంటెస్టెంట్ లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరు ఫేమస్ లేడీలు లేనట్లేనా..?

Bigg Boss Season 8 Shooting Update: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలటీ షోలలో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఈ షోకు జనాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అదే క్రమంలో ఈ షోపై ఎన్నో విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో మరింత పాపులారిటీతో దూసుకుపోయింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా ఈ షోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా తెలుగులో అయితే బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు ఎగబడి చూసేందుకు ముందుటారు ఆడియన్స్.


ముందుగా ఈ షో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి మంచి పాపులర్ తెచ్చాడు. ఈ ఫస్ట్ సీజన్ చాలా బాగా సక్సెస్ అయింది. ఎంతోమంది సినీ ఆడియన్స్ ఈ షోకు మంత్రముగ్దులయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సెకండ్ సీజన్‌కి హోస్ట్‌గా చేశాడు. ఈ సీజన్ కూడా బాగా ప్రజాదరణ పొందింది. ఇక ఆ తర్వాత మూడో సీజన్‌ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి ఈ షోను తన భుజాలపై వేసుకుని దాదాపు ఏడు సీజన్ల వరకు కొనసాగించాడు.

ఈ ఏడు సీజన్లు ఎంతో గ్రాండ్‌గా నిర్వహించడమే కాకుండా మంచి పాపులర్ కూడా తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున్ని తప్ప మరేవరినీ ఆ స్థానంలో ఊహించుకోనట్లుగా నాగర్జున గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చివరిగా వచ్చిన సీజన్ 7 చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 8 కోసం రంగం సిద్దం చేశారు. ఇటీవలే ఈ సీజన్ 8కి సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. కానీ తేదీ మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోన్న కంటెస్టెంట్లు వీరే అని ఓ లిస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Also Read: బిగ్ బాస్ సీజన్ – 8 ప్రోమో.. ఎలా ఉందో చూశారా..?

ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్‌ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో బిగ్ బాస్ షోకి వచ్చిన కంటెస్టెంట్లను కూడా తిరిగి తిసుకువస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇలా ఈ షో సీజన్ 8 ప్రారంభయ్యే ముందు వస్తున్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్ ఇదేనంటూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది.

బిగ్‏బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్:

అందులో యాంకర్ అంజలి పవన్, యాంకర్ వింధ్య విశాక, యూట్యూబర్ నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, యాంకర్ రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, యాంకర్ నిఖిల్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ అనీల్ గీలా, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, సినీనటి సోనియా సింగ్, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, హీరోయిన్ కుషితా కల్లపు, యూట్యూబర్ వంశీ, నటి సురేఖ వాణి కూతురు సుప్రిత వంటి వారి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో షూటింగ్‌కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగానే తాజాగా నాగార్జునకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. అలాగే ఈ సీజన్ 8లో కుమారీ ఆంటీ, బర్రెలక్క కంటెస్టెంట్లుగా ఉన్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్ 8లో కుమారీ ఆంటీతో పాటు బర్రెలక్క కూడా లేదని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో త్వరలో అధికారిక అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×