EPAPER

Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. కోర్టు ముందు నాగ్ ఆవేదన, సుప్రియ సాక్ష్యం

Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. కోర్టు ముందు నాగ్ ఆవేదన, సుప్రియ సాక్ష్యం

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna ) మంగళవారం కోర్టు ముందు హాజరై.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె అసత్య ఆరోపణలు చేశారని వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న తమ కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేయడం మనోవేదనకు గురి చేసిందని ఆయన వెల్లడించినట్లు సమాచారం.


మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలి – నాగార్జున

‘‘మంత్రి మాట్లాడిన మాటలు అన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అన్ని పత్రికలు ప్రచురించాయి. దీనివల్ల మా కుటుంబం మరింత మానసిక క్షోభ అనుభవిస్తోంది. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. జాతీయస్థాయిలో అనేక అవార్డులు కూడా వచ్చాయి.


ముఖ్యంగా సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అయ్యాయి అని, మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడటం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. కాబట్టి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ నాగార్జున కోర్టు ముందు కోరినట్లు సమాచారం. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారని, ఎంతో పేరు, ప్రతిష్టలు ఉన్న తమ కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని తెలిపారు. అందుకే, బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున.

నాగార్జునతోపాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ ఇచ్చారు. మొదట న్యూస్ ఛానల్స్‌లో అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూసి నాగార్జునకి చెప్పానని తెలిపారు. ఆ వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యానని, మరుసటి రోజు మంత్రి వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యాయని చెప్పారు. ఇక, విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజున రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని తెలిపింది. ఆ తర్వాత కోర్టు నుండి బయటకు వెళ్లిపోయింది నాగార్జున కుటుంబం.

సమంత – నాగచైతన్య విడాకుల కారణం కేటీఆర్ – కొండా సురేఖ..

అసలు విషయంలోకెళితే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ పై ఆగ్రహంతో సినీ సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమంత – నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని, ఆమె చేసిన కామెంట్లు సర్వత్రా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఎన్ – కన్వెన్షన్ హాల్ గతంలోనే కూల్చివేయాలని చెప్పగా.. నాగార్జున కూల్చివేయకూడదని కేటీఆర్ ను అడిగారని, అయితే కేటీఆర్ తన వద్దకు సమంతను పంపిస్తే ఆ కూల్చివేతను ఆపేస్తానని కేటీఆర్ చెప్పారు. అయితే నాగార్జున కూడా తనకు భారీ ఆదాయాన్ని ఇచ్చే కన్వెన్షన్ కూల్చివేతను తట్టుకోలేక.. సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ సమంత నాగార్జునతో గొడవకు దిగింది. ఈ నేపథ్యంలోనే సమంత – నాగచైతన్యకు విడాకులు ఇప్పించారంటూ కొండా సురేఖ చేసిన కామెంట్లపై సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భగ్గుమంది.

అక్కినేని ఫ్యామిలీకి అండగా సినీ సెలెబ్రిటీలు..

ముఖ్యంగా సినీ సెలబ్రిటీలంతా ఏకతాటిపై నిలిచి అటు అక్కినేని కుటుంబానికి ఇటు సమంతాకు అండగా నిలిచారు. ఈ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ వేశారు. చిరంజీవి, రవితేజ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, కిరణ్ అబ్బవరం ఇలా ఎంతోమంది హీరోలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లకు దిగివచ్చిన కొండా సురేఖ సమంతకు సారీ చెప్పింది. కానీ అక్కినేని కుటుంబానికి ఎటువంటి క్షమాపణలు కోరలేదు. దీంతో పరువు నష్టం దావా వేసిన నాగార్జున నేడు కోర్టు ముందు హాజరై ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం.

Related News

Poonam Kaur: త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. నిర్మాతపై మండిపడ్డ పూనమ్

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine : లిప్ కిస్ తో టెంప్ట్ అయిన హీరోయిన్.. అవ్వా.. అక్కడే పని కానిచ్చేసిందిగా..

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Pushpa 2: నీయవ్వ.. తగ్గేదేలే.. చెప్పిన డేట్ కు రావడం పక్కా..

Regina Cassandra : రెజినా వెనుక ఇంత కుట్ర జరిగిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

×