EPAPER
Kirrak Couples Episode 1

Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా.. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో!

Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా.. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో!

Akkineni Nagarjuna: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు లీగల్ కష్టల్లో చిక్కుకున్నారు. నాగార్జునపై, తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే సినీ పరిశ్రమ అంతా ఒక్కటై ఖండించింది. దీంతో తాను కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటికే నాగార్జున కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో నాగార్జున చట్టపరంగా దీని గురించి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు నాగార్జున.


అందుకే విడాకులు

కొండా సురేఖ.. తనతో పాటు తన కుటుంబ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, అందుకే తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. ముందుగా నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అంటూ కేటీఆర్‌ను విమర్శించాలనుకున్నారు కొండా సురేఖ. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎక్కువగా నాగార్జునను, తన కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అన్నారని, దానికి నాగార్జున ఒప్పుకున్న సమంతకు అది ఇష్టం లేక విడాకులు తీసుకొని వెళ్లిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాలు అన్నింటినీ ఆయన పరువు నష్టం దావాలో స్పష్టంగా పేర్కొన్నారు నాగార్జున.


Also Read: ఇంటికి దూరంగా సమంత.. కొండా సురేఖ కామెంట్సే కారణమా?

నిజం లేదు

ఇప్పటి వరకు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణమేంటో ప్రేక్షకులకు తెలియదు. కానీ వీరిద్దరూ విడాకులు ప్రకటించగానే సమంతదే తప్పు అన్నట్టుగా చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఉన్నట్టుండి నాగార్జున అలా చేయడం వల్లే సమంత విడాకులు తీసుకుంది అంటూ కొండా సురేఖ కామెంట్స్ చేయగానే అవి సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి. ఆమె చేసిన ఆరోపణలు నిజమేనేమో అని నమ్ముతున్నవారు కూడా ఉన్నారు. కానీ సమంత సైతం తమ విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యం అని క్లారిటీ ఇచ్చింది. నాగచైతన్య కూడా అదే మాట చెప్పాడు.

ఒత్తిడి లేదు

నాగార్జున కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావాలో తమతో పాటు సమంతపై కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. అనవసరంగా సమంత పేరును మధ్యలోకి లాగారని పేర్కొన్నారు. కొండా సురేఖ చెప్పినట్టుగా సమంతను విడాకులు తీసుకోమని తమ కుటుంబం ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదని దావాలో పేర్కొన్నారు నాగార్జున. కేవలం తమ కుటుంబానికి ఉన్న ఫేమ్‌ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ విషయం గురించి వినగానే చాలామంది తమకు ఫోన్లు చేశారని, వారందరికీ ప్రత్యేకంగా వివరించలేకే నేరుగా సోషల్ మీడియాలో దీనిపై స్పందించానని నాగార్జున స్పష్టం చేశారు. ఇప్పటికే కొండా సురేఖ.. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబం నుండి పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయం ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

Related News

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?

Mohanraj: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ విలన్ కన్నుమూత

Devara: కలెక్షన్లు తగ్గడం వెనుక వారి హస్తము ఉందా.. అసలు నిజం ఏంటంటే..?

Kasthuri Shankar: సురేఖ వివాదంలోకి త్రిషను లాగిన బుల్లితెర నటి.. కొత్తేమి కాదంటూ..?

Big Stories

×