EPAPER

Naga Vamsi: మిడ్ నైట్ షోస్ వెయ్యడం వలన నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను

Naga Vamsi: మిడ్ నైట్ షోస్ వెయ్యడం వలన నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను

Naga Vamsi: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్స్ లో హారిక హాసిని క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తారు. త్రివిక్రమ్ బయట బ్యానర్ తో సినిమాలు చేయటం మానేసి చాలా ఏళ్లు అయింది అని చెప్పాలి. ఇది త్రివిక్రమ్ కి ఒక హోం బ్యానర్ అని చెప్పాలి. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ ను నిర్మించారు. ఈ బ్యానర్ లో నాగవంశీ సినిమాలు చేస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్లు రిలీజ్ అయ్యాయి. జెర్సీ వంటి నేషనల్ అవార్డు ఫిలిం కూడా తెరకెక్కించిన ఘనత ఈ బ్యానర్ కి ఉంది. ఇక ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతారు నిర్మాత నాగ వంశీ.


కేవలం నిర్మాతగానే కాకుండా డిస్టిబ్యూటర్ గా కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు నాగ వంశీ. ఈ సినిమాకి సంబంధించి మంచి లాభాలు వచ్చాయని చెబుతూ వచ్చారు. ఇకపోతే ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం అలానే కొంతమందికి సినిమా నచ్చడంతో సినిమా హిట్ దిశగా మారిపోయిందని చెప్పాలి. హారిక హాసిని బ్యానర్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా మొదట నెగిటివ్ టాక్ ని సాధించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ త్రివిక్రమ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వలన ఆ సినిమా కూడా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించి మిడ్ నైట్ షో స్ వేశారు. ముందు ప్రశాంత్ నేను దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమాకి మిడ్ నైట్ వేసినప్పుడు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే స్ట్రాటజీ గుంటూరు కారం సినిమాకి ఉపయోగించాడు వంశీ. సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మిడ్ నైట్ షో స్ వేసి తప్పు చేశాను అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా మాట్లాడుతూ మిడ్ నైట్ షోస్ వేయడం వల్ల నేను కొత్త విషయం తెలుసుకున్నాను. అదేంటంటే సినిమాకి వాటి వలన నెగటివ్ వచ్చినా కూడా సినిమా బాగుంటే కచ్చితంగా చూస్తారు ఆడియన్స్ ప్రూవ్ చేశారు. దేవర సినిమాకు అదే జరిగింది, గుంటూరు కారం సినిమాకు అదే జరిగిందని చెబుతూ వచ్చారు.


ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అలానే గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమా కూడా ప్రస్తుతం బ్యానర్ లో నిర్మితమవుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టూ పార్ట్స్ లో రానున్నట్లు కూడా తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా విజయ్ దేవరకొండ ను చూపించాడు గౌతం.

Related News

Vettaiyan Day 2 Collections: జైలర్ మేనియా షురూ.. రజినీ మాస్ కుమ్ముడు..!

Doraemon : డోరేమాన్ వాయిస్ ఇకలేదు… ఆలస్యంగా విషయాన్ని వెల్లడించిన ఫ్యామిలీ

Pooja Hegde:82 ఏళ్ల వ్యక్తితో జత కట్టిన 33 ఏళ్ల బ్యూటీ..!

Vishwambhara Teaser : మెగా మాస్ బియాండ్ యూనివర్స్… విజువల్ ట్రీట్ గా “విశ్వంభర” టీజర్

Nara Rohit Marriage : రేపే ఎంగేజ్మెంట్… మరీ చిన్న పిల్లని ఎలా మాస్టారు

Lucky Bhaskar : “లక్కీ భాస్కర్” రిలీజ్ ఆలస్యం… ఆ ఒక్క భాష ప్రేక్షకులకే ఈ ట్విస్ట్

Big Stories

×