Naga Chaitanya – Sobhita Wedding Date:ఎట్టకేలకు అక్కినేని (Akkineni) ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. 2022 నుండి ప్రేమలో ఉన్న అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ (Sobhita dhulipala). ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫోటోలను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా షేర్ చేశారు. దీంతో అప్పటివరకు మీడియాలో వస్తున్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పడింది.
నాగచైతన్య, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..
ఇటీవల అక్కినేని నాగార్జున ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ, శోభితాల నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ‘‘నిశ్చితార్థమైతే చేశాం. కానీ, పెళ్లికి కాస్త సమయం పడుతుంది’’ అని తెలిపారు. అయితే, ఇప్పటికే వారిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. డిసెంబరు 4న ఇద్దరూ ఏడు అడుగులు, మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత కుటుంబ సభ్యులు..
శోభిత ఇంట్లో ఇప్పటికే పెళ్లి పనులు మొదలైన విషయం అందరికీ తెలిసిందే. వైజాగ్ లోని తన నివాసంలో.. తన కాబోయే అత్తగారు దగ్గుబాటి లక్ష్మీ(Daggubati lakshmi) పంపించిన పట్టుచీరలో ఆమె పెళ్లి పనులు ప్రారంభించారు. వినాయక పూజ మొదలుపెట్టి , ఆ తర్వాత పసుపు దంచడం, గోధుమ రాయి వంటి పనులలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. దీనికి తోడు పెద్దవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు శోభిత ధూళిపాల. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తూ ఉండగా.. ఇప్పుడు ఈ డేట్ వైరల్ గా మారింది. మరి దీనిపై త్వరలోనే అక్కినేని కుటుంబం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందని సమాచారం.
సమంతా తో విడాకులు..
ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత, అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మనం (Manam) మూవీ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇక పెద్దలను ఒప్పించి, 2017లో వివాహం చేసుకున్న ఈ జంట మనస్పర్ధలు రావడంతో 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక సమంత ఒంటరిగా కెరియర్ కొనసాగిస్తుండగా ఇప్పుడు నాగచైతన్య మరో పెళ్లికి సిద్ధం అయ్యారు.