EPAPER

Dhootha Trailer : చైతు బర్త్ డే స్పెషల్.. దుమ్ములేపుతున్న ధూత ట్రైలర్..

Dhootha Trailer : చైతు బర్త్ డే స్పెషల్.. దుమ్ములేపుతున్న ధూత ట్రైలర్..

Dhootha Trailer : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య .. ఇప్పటివరకు వెండితెరపై సందడి చేసిన ఈ హీరో.. బుల్లితెరపై ఓటీటీ ప్లాట్ఫామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఇందులో తన లక్ ఎలా ఉందో ట్రై చేయడానికి డిసెంబర్ 1 న ధూత గా వస్తున్నాడు నాగచైతన్య. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇక ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి..


ధూత.. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది .ఇప్పుడు ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగా.. వెబ్ సిరీస్ పై ఉత్కంఠత రేపే విధంగా ఉంది. ఇందులో నాగచైతన్య పర్ఫామెన్స్  టెరిఫిక్ గా ఉంది. మొదటిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టిన నాగచైతన్య.. ఫస్ట్ వెబ్ సిరీస్ తోటే అందరి మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో జర్నలిస్టుగా చైతు కనిపిస్తున్నాడు. మొట్టమొదటిసారి ఇలాంటి జోనర్ లో చేసినా.. పర్ఫామెన్స్ పరంగా ఇరగదీస్తున్నాడు.

ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తే ఇందులో చైతు యాక్షన్ కి 100 అవుట్ ఆఫ్ 100 పడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టును ఆధ్యంతం ఆసక్తికరంగా వెబ్ సిరీస్ లో మలిచారు అనే విషయం ట్రైలర్ ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ లో “మేము మెసెంజర్స్.. తెలుగులో చెప్పాలంటే దూతలు” అని చెప్పే డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. సమాజానికి జర్నలిస్టులు ఎంత అవసరమో హైలైట్ చేసే విధంగా ఈ డైలాగు ఉంది.


2 నిమిషాల 24 సెకండ్ల నిడివితో సాగే ఈ ట్రైలర్ లో కొన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షాట్స్ చూపించారు. ఈ సీన్స్ ను బట్టి వెబ్ సిరీస్ లో ట్విస్ట్ లు ,సస్పెన్స్ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక నాగచైతన్య తనకు అస్సలు సంబంధంలేని ఒక క్రైమ్ లో ఇరుక్కున్నట్టు ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. ట్రైలర్ మధ్యలో అక్కడ చైతుకి గతం ఉన్నట్టు కొన్ని షాట్స్ ఉన్నాయి. ఇక గతానికి లింకు వేస్తూ కొన్ని హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది.

ఇలా జర్నలిజం.. క్రైమ్ థ్రిల్లర్.. కాంబోలు ఒకప్పుడు హిందీలో ఎక్కువగా వచ్చేది. అయితే మొదటిసారిగా ఇవి తెలుగు ఆడియన్స్ కి కూడా డైరెక్ట్ గా పరిచయం చేయబోతున్నాడు విక్రమ్.ప్రామిసింగ్ ట్రైలర్ తో ముందుకు వచ్చిన నాగచైతన్య.. సాలిడ్ కంటెంట్ తో కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడనే అనిపిస్తుంది. ఇక ధూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్ ,కన్నడ, మలయాళం భాషల్లో అవైలబుల్ గా ఉంటుంది. 

Related News

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×