E-Paper
Advertisement

Naga Chaitanya-Sobhita: చైతు-శోబిత.. దొరికిపోయిన డేటింగ్ కపుల్స్!

Naga Chaitanya-Sobhita: చైతు-శోబిత.. దొరికిపోయిన డేటింగ్ కపుల్స్!

Naga Chaitanya-Sobhita: సమంత-నాగచైతన్య విడిపోయాక ఎవరిలైఫ్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇద్దరూ సినిమాలు, కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల చైతూ హైదరాబాద్‌లో కొత్త ఇంటిని నిర్మించుకొని ఒక్కడే జీవిస్తున్నాడు. అయితే చైతూకు సంబంధించి కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. మాజీ మిస్ ఇండియా, స్టార్ హీరోయిన్‌తో చైతన్య డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

నటి శోభితతో చైతూ డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ న్యూస్‌పై చైతన్య స్పందించకపోయినప్పటికీ.. శోభిత మాత్రం ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయింది. వారి మధ్య అటువంటిది ఏమీ లేదని.. అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక ఫొటో నెట్టింట్లో వైరలవుతోంది. లండన్‌లో చైతన్య, శోభిత ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫేమస్ చెఫ్ సురేందర్ మోహన్.. చైతూతో ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో వెనుకాల శోభిత కూర్చొని ఉండడం స్పష్టంగా చూడొచ్చు.

ఈ ఫొటోతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరింది. మరి దీనిపై చైతూ, శోభిత స్పందిస్తారో లేదో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×