EPAPER

Naatu Naatu: నాటు నాటుకు ఆస్కార్ అందుకే.. పాటలో పదును ఇదే..

Naatu Naatu: నాటు నాటుకు ఆస్కార్ అందుకే.. పాటలో పదును ఇదే..

Naatu Naatu: నాటు నాటు. ఇప్పుడు ప్రపంచమంతా ఇదే ఊపు. ఆస్కార్ అవార్డుతో తెలుగోడి నాటు కొట్టుడుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. మన నాటు పదాలు, నాటు స్టెప్పులకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కొరియోగ్రఫీకి అవార్డు లేదు కాబట్టి డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్‌ ఆస్కార్ అందులోలేక పోయారు. లేదంటే ఆ ముగ్గురూ ఆస్కార్ వీరులుగా నిలిచేవారు.


నాటు నాటు సాంగ్ అనగానే.. అందరికీ గుర్తుకొచ్చేది ఆ మాస్ బీట్ అండ్ మాస్ స్టెప్స్. ప్రేక్షకుల దృష్టంతా డ్యాన్స్ మీదే ఉంటుంది. ఆ మ్యూజిక్ మన కాళ్లనూ కదిలిస్తుంది. ఇక నాటు నాటు నాటు నాటు.. ఈ రిథం మరింత జోష్ తీసుకొస్తుంది.

నాటు నాటు సాంగ్‌లో నాటు నాటు పదాలు కాకుండా మిగతా లిరిక్ ఏంటంటే.. చాలామంది వెంటనే చెప్పలేరు. కొందరికి మిగతా పాట ఏమాత్రం గుర్తుండదు. కానీ, ఆ పాటను పూర్తిగా వింటే.. అందులోని అందమైన తెలుగు పదాల పొందిక కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాటు పదాలు.. పల్లె నేపథ్యం స్పష్టంగా వినిపిస్తుంది. ఏరికోరి.. పదాలు కూర్చి.. పాటగా మార్చారు చంద్రబోస్. అందుకే నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు దాసోహమయ్యాయి. మన తెలుగు భాష గొప్పతనం ఖండాంతరాలకు చేరింది.


నాటు నాటు పాట ఆసాంతం ఓసారి చదివేయండి.. ఆ పాట పదును ఎంతో మీకే తెలుస్తుంది…

పల్లవి:

పొలంగట్టు దుమ్ములోన

పోట్లగిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలో

పోతరాజు ఊగినట్టు

కిర్రు సెప్పులేసుకొని

కర్రసాము సేసినట్టు

మర్రిసెట్టు నీడలోన

కుర్రగుంపు కూడినట్టు

ఎర్రజొన్న రొట్టెలోన

మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడు

నా పాట సూడు

నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు

నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు

నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు

చరణం1:

గుండెలదిరిపోయేలా

డండనకర మోగినట్టు

సెవులు సిల్లు పడేలాగ

కీసుపిట్ట కూసినట్టు

ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు

కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు

ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు

నా పాట సూడు

నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. ఊర నాటు

నాటు నాటు నాటు.. గడ్డపారలాగ చెడ్డ నాటు

నాటు నాటు నాటు.. ఉక్కపోతలాగ తిక్క నాటు

చరణం 2:

భూమి దద్దరిల్లేలా

ఒంటిలోని రగతమంతా

రంకెలేసి ఎగిరేలా

ఏసేయ్ రో ఎకాఎకీ

నాటు నాటు నాటు.. వాహా.. ఏస్కో

అరె దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే

దూకెయ్ రో సరాసరి

నాటు నాటు నాటు

>

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×