Naam Movie: మామూలుగా ఒక సినిమాకు కథ సిద్ధమయ్యి, దానికి షూటింగ్ జరిగి ప్రేక్షకుల ముందుకు రావాలంటే చాలాకాలమే పడుతుంది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులు అయితే ఒక సినిమాను ప్లాన్ చేయడం కోసం దాదాపు అయిదేళ్లు తీసుకుంటారు. కొందరు దర్శకులు మాత్రం ఆరు నెలల్లోనే మూవీని పూర్తిచేస్తారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఒక రికార్డ్ క్రియేట్ అయ్యింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఒక సినిమా.. 20 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. అసలు ఈ సినిమాను ఇప్పుడెందుకు విడుదల చేస్తున్నారని బీ టౌన్ ప్రేక్షకులు షాకవుతున్నారు.
ఎన్నో కారణాలు
సీనియర్ హీరో అజయ్ దేవగన్ ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించేవాడు. అలా ఎందరో దర్శకులతో కలిసి పనిచేసి ప్రేక్షకులకు మంచి మాస్ ఎంటర్‌టైనర్ హిట్స్ ఇచ్చాడు. కొందరు దర్శకులతో అజయ్ దేవగన్ కాంబో సూపర్ హిట్ అయ్యింది. అలాంటి దర్శకుల్లో అనీస్ బాజ్మీ (Anees Baazme) ఒకరు. వీరిద్దరూ కలిసి చేసిన మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో పర్సనల్‌గా వీరి మధ్య బాండింగ్ కూడా చాలానే పెరిగింది. అయితే దాదాపుగా 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో ‘నామ్’ అనే మూవీ తెరకెక్కింది. అప్పట్లోనే ఈ సినిమా విడుదలయ్యింటే మంచి విజయాన్ని సాధించేది. కానీ ఇప్పటివరకు ఇది విడుదల అవ్వకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి.
Also Read: ఎట్టకేలకు శుభం కార్డు పలికిన అభిషేక్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్..!
అయిదేళ్ల క్రితం మరోసారి
20 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నామ్’ (Naam) సినిమాను విడుదల చేసే సమయానికి దానిని నిర్మించిన వారిలో ఒక నిర్మాత మరణించారు. దీంతో కొన్నాళ్ల పాటు విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. నిర్మాత మరణించడంతో తర్వాత ఈ సినిమాపై పలు ఆర్థిక భారాలు పడ్డాయి. అలా కొన్నాళ్ల పాటు ‘నామ్’ విడుదలకు కష్టమయ్యింది. 20 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తయినా అయిదేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఒక గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దర్శకుడు అనీస్. ఇక ఇన్నాళ్ల తర్వాత ‘నామ్’ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని పెన్ మరుధర్ నిర్ణయించుకున్నారు. నవంబర్ 22న రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.
అప్పుడు ఆ టైటిల్‌తో
‘నామ్’లో అజయ్ దేవగన్ (Ajay Devgn)కు జోడీగా భూమిక (Bhumika), సమీరా రెడ్డి (Sameera Reddy) నటించారు. 2013లో ‘బేనామ్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. అది కూడా పలు కారణాల వల్ల వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇలాంటి ఒక ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన సినిమాను ఇన్నాళ్ల తర్వాత ఎందుకు విడుదల చేస్తున్నారనే సందేహం ప్రేక్షకుల్లో మొదలయ్యింది. అజయ్, అనీస్ కాంబినేషన్ సూపర్ హిట్ అనుకున్న సమయంలోనే ఈ మూవీని విడుదల చేసుంటే బాగుండేది అని, ఇప్పుడు ‘నామ్’ను చూడడానికి థియేటర్లకు ఎవరూ రారు అని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం అజయ్ హీరోగా నటించిన ‘సింగం అగైన్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
AJAY DEVGN – ANEES BAZMEE: 'NAAM' TO RELEASE ON 22 NOV… ANNOUNCEMENT POSTER UNVEILS… #Naam – starring #AjayDevgn and directed by #AneesBazmee – to release in *cinemas* on 22 Nov 2024… Worldwide release by #PENMarudhar.
Produced by #AnilRoongta [Roongta Entertainment] in… pic.twitter.com/toj2RtzdB6
— taran adarsh (@taran_adarsh) October 26, 2024