EPAPER

Naa Saamiranga Review : నా సామిరంగ.. కింగ్ నాగార్జునకు సంక్రాంతి మళ్లీ కలిసొచ్చిందా ?

Naa Saamiranga Review : నా సామిరంగ.. కింగ్ నాగార్జునకు సంక్రాంతి మళ్లీ కలిసొచ్చిందా ?

Naa Saamiranga Review : ప్రతిఏటా సంక్రాంతికి కొందరు హీరోల సినిమాలు ఖచ్చితంగా విడుదలవుతాయి. ఆ లిస్టులో కింగ్ నాగార్జున ఒకరు. బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన వంటి విజయవంతమైన సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే నిలిచి.. ప్రేక్షకులను మెప్పించాయి. ఈసారి నా సామిరంగ తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి టార్గెట్ గా.. మూడంటే మూడే నెలల్లో తీసిన సినిమా ఇది. విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయమైన నా సామిరంగ.. సంక్రాంతి ప్రేక్షకులకు వినోదాన్నిచ్చిందో లేదో చూద్దాం.


సినిమా : నా సామిరంగ

నటీనటులు : నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నామేనన్, రుక్సర్ థిల్లాన్, షబ్బీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు, మహేశ్ తదితరులు


సంగీతం : ఎంఎం కీరవాణి

మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విజయ్ బిన్ని

నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

రిలీజ్ డేట్ : 14-01-2024

కథ

కిష్టయ్య (నాగార్జున) ఒక అనాథ. అంజి (అల్లరి నరేశ్) తల్లి కిష్టయ్యను కూడా చేరదీస్తుంది. ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలగుతారు. తల్లి మరణం తర్వాత.. ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) పిల్లలకు అండగా నిలబడతాడు. అందుకే కిష్టయ్యకు పెద్దయ్యకు ఎనలేని గౌరవం. కిష్టయ్యకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే వరాలు (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా కిష్టయ్యను ప్రేమిస్తుంది.

చిన్నప్పుడే చదువుకోసం పట్టణానికి వెళ్లిన వరాలు.. 15 ఏళ్ల తర్వాత తిరిగి ఊరికొస్తుంది. మళ్లీ ఇద్దరి ప్రేమ మొదలవుతుంది. తమ ప్రేమ విషయాన్ని చెప్పేందుకు వరాలును తీసుకుని ఇంటికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేశ్) తన కూతురిని పెద్దయ్య కొడుకు దాసు (షబ్బీర్)కు ఇచ్చి పెళ్లిచేయాలని సంబంధం మాట్లాడేందుకు వస్తాడు.

కిష్టయ్య-వరాలు ప్రేమను అర్థం చేసుకున్న పెద్దయ్య.. దాసుతో పెళ్లికి నిరాకరిస్తాడు. కూతురిని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేసేందుకు వరదరాజులు ససేమిరా అంటాడు. ఆ తర్వాత ఏమైంది ? కిష్టయ్య-వరాలు ప్రేమ పెళ్లి పీటల వరకూ వెళ్లిందా ? ఆ తర్వాత దాసు ఏం చేశాడు ? అంజిపై దాసు పగకు కారణమేంటి ? కిష్టయ్య, అంజిలను చంపాలని దాసు వేసిన ప్లాన్ పనిచేసిందా ? కథలో భాస్కర్(రాజ్ తరుణ్) స్టోరీ ఏంటి ? వంటి విషయాలు తెలియాలంటే.. థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.

ఎలా సాగింది ?

నా సామిరంగ (Naa Saami Ranga).. మలయాళంలో హిట్టైన సినిమాకు రీమేక్. కానీ.. ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిచేందుకు రైటర్ ప్రసన్న కుమార్ చేసిన ప్రయత్నం ఫలించింది. స్నేహం, ప్రేమ, విధేయత, ప్రతీకారం.. వంటి అంశాలతో ముడిపడి ఉన్న కథ. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి కానీ.. ఈ సినిమాను 1980ల్లో కోనసీమ బ్యాక్ డ్రాప్ లో తీసి.. కాస్త కొత్తగా చూపించారు.

యాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. తెరపై నాగార్జున చేసిన సందడి బాగుంది. అంజి, వరాలు పాత్రలు మెప్పిస్తాయి. కిష్టయ్య-అంజిల హత్యకు దాసు ప్రణాళిక రచించడంతో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ప్రేమకథలో కొత్తదనం ఏమీ కనిపించదు. అంజిపై దాడితో ఎపిసోడ్ మళ్లీవేగంగా ఉంటుంది. ఆ తర్వాత ఎమోషనల్ గా మారుతుంది. క్లైమాక్స్ లో నాగ్ చేసే హంగామా.. కింగ్ అభిమానులకు కనులవిందుగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

నాగార్జున, నరేశ్ యాక్టింగ్
యాక్షన్ ఎపిసోడ్స్
2,3 పాటలు

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ
స్లో గా సాగే లవ్ ట్రాక్

సంక్రాంతి పండక్కి.. మాస్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్ మెంట్ “నా సామిరంగ”

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×