EPAPER

Music Shop Murthy Gets Good Response: ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఇంతకీ ఈ సినిమాలో ఏముందంటే ?

Music Shop Murthy Gets Good Response: ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఇంతకీ ఈ సినిమాలో ఏముందంటే ?

Music Shop Murthy Movie Gets Good Response: ఏ సినిమాలో అయినా కంటెంట్ ఉంటే అది తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా.. భారీ బడ్జెట్‌తో సినిమా అయినా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తది. ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలను పరిశీలిస్తే తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ బడ్జెట్‌తో వచ్చిన పలు సినిమాల కంటే ఎక్కువగా ఆదరణ పొందాయి. అందులో కంటెంట్ క్వాలిటీగా ఉండడం.. జనాలకు ప్రస్తుతం ఏది కావాలో అది చూపించారు. అందుకే అవి భారీగా హిట్టయ్యాయి. ఆ సినిమాల వల్ల చాలామంది నూతనంగా రాణించాలనుకున్న యాక్టర్లకు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు దక్కుతున్నాయి.


అయితే, జూన్ 14న విడుదలైన ఓ సినిమా కూడా సినీప్రియులను ఎంతగానో అలరించింది. థియేటర్లో ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చి సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సినిమాలో లోపాలను వెతకలేదంటే నమ్మండి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి స్పందనే కాదు.. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. కారణమేమంటే.. సినిమాలో మంచి సందేశంతో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సీన్స్.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మూవీలో నటించిన ప్రతి యాక్టర్ కూడా కేవలం నటించలేదు.. ఆ పాత్రలో జీవించారు. అందుకే ఈ సినిమా అందరికీ ఎంతగానో కనెక్ట్ అయ్యింది.

ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజయ్యింది. అప్పుడు థియేటర్లలో ఏ విధంగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను థియేటర్లలో చూడనివారంతా కూడా ఓటీటీలో చూస్తూ.. సినిమా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సందేశాత్మకమైన సినిమాను తీసినందుకు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు నెట్టింటా ఎక్కడా చూసినా ఈ మూవీ గురించే చర్చిస్తున్నారు. అంతేకాదు.. ఓటీటీ సంస్థల్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది.


Also Read: రెండు ఫిలింపేర్ అవార్డులు అందుకున్న సాయిపల్లవి.. సెలబ్రేట్ చేసిన తండేల్ టీమ్

ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. శివ పాలడుగు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటిలు నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సంగీతాన్ని అందించాడు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు తన నటనతో అద్భుతంగా రాణించారు. అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి, ఆమని కీలక పాత్రల్లో నటించారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేశారు. సినిమా బాగుండడంతో అసిస్టెంట్ నుంచి డైరెక్టర్ వరకు.. ఈ సినిమా కోసం పనిచేసినవారికి, మూవీలో యాక్ట్ చేసినవారికి.. ఇలా ప్రతి ఒక్కరిని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నట్టుగానే కుటుంబ సమేతంగా సినిమాను చూసి తెగ ఆనందపడుతున్నారు ప్రేక్షకులు.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×