EPAPER

Mrunal Thakur: మృణాల్.. ఏంటా డ్రెస్.. నిన్ను ఎలా ఊహించుకున్నాం.. ఛీఛీ

Mrunal Thakur: మృణాల్.. ఏంటా డ్రెస్.. నిన్ను ఎలా ఊహించుకున్నాం.. ఛీఛీ

Mrunal Thakur: ఓ.. సీతా.. వదలనిక కడదాకా అని సీతారామం చిత్రంలో రామ్ చెప్పిన డైలాగ్ ను అతడు ఎంత సీరియస్ గా తీసుకున్నాడో తెలియదు కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఆ సినిమా తరువాత నుంచి మృణాల్ ను  గుండెల్లో పెట్టుకున్నారు.  సీతగా తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్  బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


తెలుగువారు మృణాల్ పేరును సీతగా కూడా మార్చేశారు. అప్పటినుంచి మృణాల్ ను తెలుగు అమ్మాయిలానే ఫీల్ అవుతున్నారు. ఆమె బాలీవుడ్ హీరోయిన్ అయినా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని కనిపిస్తే విమర్శించడం మొదలుపెట్టారు. సీతలానే పద్దతిగా ఉండమని కామెంట్స్ చేశారు. ఇక కొంతవరకు మృణాల్ అప్పుడు ఫ్యాన్స్ కోరిక మేరకు ఎక్కువగా చీరలు, డ్రెస్ లతోనే కనిపించింది. ఆ తరువాత కూడా హయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్  చిత్రాల్లో కూడా ఈ చిన్నది తన అవుట్ ఫిట్స్ తో కుర్రకారును మెప్పించింది.

సినిమాలు వేరు.. సోషల్ మీడియా వేరు అని  చాలామందికి తెలియదు. దీంతో సినిమాలో ఉన్నంత  పద్దతిగా మృణాల్ సోషల్ మీడియాలో ఉండదు. అందులోనూ ఈ చిన్నదానికి ఫ్యాషన్ పిచ్చి కాస్త ఎక్కువ అనే చెప్పాలి.   ఇక మృణాల్ గతేడాది కేన్స్ ఫెస్టివెల్ లో వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫొటోస్ ను ఇప్పుడెందుకు  వైరల్ చేస్తున్నారో తెలియదు కానీ, మృణాల్  డ్రెస్సింగ్ స్టైల్ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.


గతేడాది జరిగిన కేన్స్ ఫెస్టివెల్ లో మొదటిసారి మృణాల్ అడుగుపెట్టింది. రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది. వన్-షోల్డర్డ్ స్లీవ్‌లు, సీక్విన్ స్కర్ట్ మరియు ఫ్లోర్-లెంగ్త్ గౌను పై పెద్ద పువ్వు ..ఆమె అందాన్ని మరింత ఎక్కువ చేసింది. అయితే ఈ డ్రెసింగ్ స్టైల్ కొంతవరకు బాగానే ఉన్నా.. ఆ డ్రెస్ ఎద భాగంలో, థైస్ కి పైన కనిపించడం.. ఎక్కువగా ఒక సైడ్ అంతా శరీరం కనిపించడంతో  మృణాల్  పై విమర్శలు వెల్లువెత్తాయి. 

మృణాల్.. ఏంటా డ్రెస్.. నిన్ను ఎలా ఊహించుకున్నాం.. ఛీఛీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ లుక్ ఇప్పటిది కాదని, పాతది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక  మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో మృణాల్ బిజీగా మారింది.

ది ఫ్యామిలీ స్టార్, మృణాల్ కు ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేకపోయింది.  ఎన్నో  తెలుగులో ఈ చిన్నది ఫ్యామిలీ స్టార్ తో హ్యట్రిక్ అందుకుంటుందేమో అనుకున్నారు. కానీ, మధ్యలో బ్రేక్ వచ్చింది. మరి ముందు ముందు మృణాల్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. 

Related News

Tammareddy Bharadwaj: త్రివిక్రమ్ పై పూనమ్ ఫిర్యాదు.. మేము ఏం చేయలేం

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Garudan: తమిళ్ రీమేక్ లో కుర్ర హీరోలు.. ఒకరిని మించి ఒకరు ఉన్నారే

Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ

Martin:మార్టిన్ సినిమా పోస్ట్ పోన్ కానుందా.. అసలు కారణం ఏంటంటే..?

Akkineni Nagarjuna: N కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున అన్నయ్య సంచలన వ్యాఖ్యలు

Gorre Puranam : గొర్రె పురాణం రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? సినిమాను పట్టించుకోని నిర్మాత, హీరో

Big Stories

×