EPAPER

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Most Handsome Hero.. సాధారణంగా హీరోలు మరింత అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా అందం అనేది హీరోయిన్ల కే కాదు హీరోలకు కూడా ముఖ్యమే అని చెప్పాలి. అందంగా కనిపించినప్పుడే హీరో వ్యాల్యూ కూడా పెరుగుతుందనేది అందరి విశ్వాసం. అందుకే వారు కూడా తమ శరీరంలోని పలు భాగాలకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.. ఇదిలా ఉండగా తాజాగా మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్.. తాజాగా దీనిపై ఒక ప్లాస్టిక్ సర్జన్ ఒక లిస్టు తయారు చేయగా.. దీని ప్రకారం బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ (Sharukh Khan) పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి మిగతా తొమ్మిది స్థానాలలో ఎవరెవరు వున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ప్రపంచ అందగాళ్ల జాబితాలో 10వ స్థానంలో షారుఖ్ ఖాన్..

ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్ గా పేరు సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ అందగాళ్ల జాబితాలో కూడా చోటు దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఆస్తుల విషయంలో కూడా స్థానం సంపాదించుకున్న ఈయన ఇలా అన్ని విభాగాలలో కూడా పేరు సొంతం చేసుకుంటుండడంతో షారుక్ ఖాన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇకపోతే ప్రపంచంలోనే అందగాళ్ల జాబితాలో షారుక్ ఖాన్ పదవ స్థానాన్ని సంపాదించుకోగా.. ఆ లిస్టులో ఇంకా ఎవరెవరున్నారు ఇప్పుడు వైరల్ గా మారుతుంది.


ప్రపంచ అందగాళ్ల జాబితా విడుదల చేసిన ప్లాస్టిక్ సర్జన్..

అసలు విషయంలోకెళితే ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం.. అత్యంత అందగాళ్లయిన నటుల జాబితాను తయారు చేయగా.. ఇందులో షారుక్ ఖాన్ 86.76% స్కోర్ తో పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ప్రకారం ఈ అధ్యాయంలో నటుల యొక్క ముఖాల అందాన్ని అంచనా వేస్తారు. ఈ గోల్డెన్ రేషియో కి ఎంతమంది నటుల ముఖాలు దగ్గరగా ఉన్నాయో.. తమ దగ్గర ఉన్న ఫేస్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ద్వారా డాక్టర్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

టాప్ టెన్ జాబితా ఇదే..

ఈ జాబితాలో ఇంగ్లాండ్ కు చెందిన నటుడు ఆరోన్ టేలర్ జాన్సన్ మొదటి స్థానంలో నిలిచారు. 1996 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందగాళ్ల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.. రెండవ స్థానంలో బ్రిటిష్ యాక్టర్ అయిన లూసియెన్ లావిస్కాంట్ నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఐరిష్ యాక్టర్ పాల్ మెస్కల్ నిలవడం గమనార్హం. ఆ తర్వాత స్థానాలలో వరుసగా నాలుగవ స్థానం రాబర్ట్ ప్యాటిన్సన్ , ఐదవ స్థానంలో జాక్ లౌడెన్ , ఆరవ స్థానంలో జార్జ్ క్లూనీ, ఏడవ స్థానంలో నికోలస్ హౌల్ట్ , ఎనిమిదవ స్థానంలో చార్లెస్ మెల్టన్, తొమ్మిదవ స్థానంలో ఇడ్రిస్ ఎల్బా నిలవగా.. పదవ స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఏది ఏమైనా ప్రపంచ అందగాళ్ల జాబితాలో మన ఇండియన్ నటుడు చోటు దక్కించుకోవడం నిజంగా గర్వకారణం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Anee Master: జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Big Stories

×