EPAPER
Kirrak Couples Episode 1

Mollywood : మాలీవుడ్‌లో ఆగని కుదుపులు… లైం*గి*క వేధింపుల కేసులో యాక్టర్, ఎమ్మెల్యే అరెస్ట్..

Mollywood : మాలీవుడ్‌లో ఆగని కుదుపులు… లైం*గి*క వేధింపుల కేసులో యాక్టర్, ఎమ్మెల్యే అరెస్ట్..

Mollywood : జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయట పెట్టి సృష్టించిన సంచలనం మరింత దుమారం రేపుతోంది. తాజాగా లైంగిక వేధింపుల కేసులో ఓ ప్రముఖ మలయాళ నటుడు, ఎమ్మెల్యే అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మరి నటుడు ఎవరు? ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటో తెలుసుకుందాం పదండి.


ప్రముఖ, నటుడు ఎమ్మెల్యే అరెస్ట్

జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసింది. చాలామంది ప్రముఖ నటీనటులు, దర్శకులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేరళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై నటీమణులు తీవ్ర ఆరోపణలు చేశారు. నటులు ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవేల్ బాబు, చంద్రశేఖరన్, నోబుల్, విచ్చులపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు బృందం ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆరోపణలు చేసిన నటీమణుల స్టేట్మెంట్ ను నమోదు చేసింది. అదే విధంగా తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు కూడా.


ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న నటుడు, రాజకీయ నాయకుడు ముఖేష్ ఫిల్మ్ ఎథిక్స్ కమిటీకి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అరెస్టయ్యాడు. ఈ రోజు లైంగిక వేధింపుల కేసులో ముఖేష్‌పై విచారణ జరిగింది. విచారణ అనంతరం ముఖేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొచ్చిలోని కోస్టల్ పోలీస్ కార్యాలయంలో ఏఐజీ పూంగుజాలీ నేతృత్వంలో విచారణ జరగ్గా, హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడంతో ముఖేష్‌ విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Never spoken ill of Saritha or Devika', says Mukesh | Malayalam Movie News - Times of India

పని చేయని ముందస్తు బెయిల్ ప్లాన్ 

మలయాళ నటుడు, ఎమ్మెల్యే ఎం ముఖేష్ పై లైంగిక వేధింపులు దాఖలు కావడంతో ప్రస్తుతం ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మంగళవారం ఉదయం 9:45 గంటలకు కోస్టల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న ముఖేష్, కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు హాజరయ్యారు. ఇక విచారణలో భాగంగా అతన్ని దాదాపు మూడు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కానీ గతంలోనే స్థానిక కోర్టు నుంచి ముఖేష్ ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు.

అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ ప్లాన్ పని చేయలేదు. ఎందుకంటే అతనిపై ప్రస్తుతం రెండు వేరు వేరు కేసులు నమోదయ్యాయి. వడక్కంచెరి పోలీసులు ఒక కేసును నమోదు చేయగా, మరొకటి మారాడు పోలీసులు ఫైల్ చేశారు. అత్యాచారం సహా తీవ్రమైన ఆరోపణల ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ముఖేష్ పై భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 376 తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

మలయాళ చిత్ర సినిమాలో మంచి పాపులారిటీ ఉన్న ఈ నటుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా పని చేస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కంప్లైంట్ చేసిన వాళ్లు చేసిన బ్లాక్ మెయిల్ కు తాను లొంగక పోవడం వల్లే ఈ ఆరోపణలు చేశారంటూ ఆరోపణలను కొట్టిపారేశారు ముఖేష్. కానీ తాజాగా విచారణ అనంతరం ఆయన అరెస్టు కావడం సంచలనంగా మారింది.

Related News

Alia Bhatt: చుట్టమల్లే.. ఎంత ముద్దుగా పాడావ్ అలియా.. ఫిదా అయిపోయాం

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్‌కు సిద్ధమా? రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్

Rashmika Mandanna : విడాకులకు రెడీ అవుతున్న హీరోతో రష్మిక పెళ్లా?

Devara Movie : ఫస్ట్ డే వంద కొట్టాలంటే… ఇది జరిగి తీరాల్సిందే

Devara: వామ్మో.. దేవర ప్రీ రిలీజ్ డ్యామేజ్ విలువ.. అన్ని లక్షలా.. ?

Devara vs kalki : దేవర vs కల్కి.. బుకింగ్స్ లో పై చేయి ఎవరిదంటే?

Devara Movie: నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న ‘దేవర’.. కొత్త రికార్డ్స్ సెట్ చేస్తోందిగా!

Big Stories

×