EPAPER

Mohanlal: హేమా కమిటీ రిపోర్టుపై మోహన్‌లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దయచేసి అలా చేయకండి అంటూ విజ్ఞప్తి

Mohanlal: హేమా కమిటీ రిపోర్టుపై మోహన్‌లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దయచేసి అలా చేయకండి అంటూ విజ్ఞప్తి

Malayalam film industry: ప్రస్తుతం మలయాళం సినీ ఇండస్ట్రీలో ‘హేమ కమిటీ రిపోర్ట్’ సంచలనం సృష్టిస్తోంది. ఆ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలు నటీమణులను లైంగికంగా వేధించారంటూ ఈ రిపోర్ట్‌ ద్వారా బయటకొచ్చాయి. మహిళా నటులు, హీరోయిన్లపై వేధింపులు, కమిట్‌మెంట్స్ వంటి అంశాలను ఈ రిపోర్ట్ ద్వారా బట్టబయలయ్యాయి. ఈ రిపోర్ట్‌ బయటకు రావడంతో చాలామంది నటీమణులు తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొస్తున్నారు.


ఇప్పటికి ఎంతో మంది నటీమణులు తమ గోడును మీడియా ముందుకొచ్చి విలపించుకున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్టార్ నటుడు జయసూర్య, అలాగే ఎం ముఖేష్ సహా మరికొందరు ఉన్నారు. అలాగే కొందరు దర్శకులు, నిర్మాతలు సైతం ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్‌ నటుడు సిద్థిఖీ సైతం తనను లైంగికంగా వేధించాడంటూ నటి రేవతి సంపత్ కూడా ఆరోపణలు చేసింది. ఇలా ఒక్కొక్క నటీమణి ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, ఇంటర్వూలలో లేదా డైరెక్టగా మీడియా ముందుకొచ్చి తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను బయటపెట్టేందుకు వెనుకాడటం లేదు.

ప్రస్తుతం మహిళ నటులు, హీరోయిన్లపై మాలీవుడ్‌లో ఈ లైంగిక వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎక్కడ విన్నా మాలీవుడ్ హేమ కమిటీ రిపోర్ట్ అనే పేరే వినిపిస్తోంది. దీంతో కేరళ ప్రభుత్వం ఈ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుల్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. అందులో యాక్టర్ జయసూర్యతో పాటు ఎం ముఖేష్ వంటి నటులపై కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది.


Also Read: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

ఇప్పటి వరకు బయటకొచ్చి ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఆరోపణలు చెప్పిన నటీమణులలో మిను మునీర్, సోనియా మల్హర్, బెంగాలీ నటి శ్రీలేక మిత్ర వంటి వారు ఉన్నారు. వీరు వారి సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకొచ్చారు. తమను ఎంతగా ఇండస్ట్రీలో ఉండే కొందరు లైంగికంగా వేధించారో చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఒకెత్తయితే మలయాళీ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మలయాళీ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందంటూ నెటిజన్లు చిర్రెత్తిపోతున్నారు.

మలయాళ ఇండస్ట్రీలో నటీమణులకు సేఫ్టీ లేకుండా ఉంటే ఎలా మౌనంగా ఉంటున్నారని ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడంతో నటుడు సిద్థిఖీ జనరల్‌ సెక్రటరీ పదవికి రిజైన్ చేశాడు. అతను మాత్రమే కాకుండా అమ్మ సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ సైతం తన పదవికి ఇటీవల రిజైన్ చేశాడు. దీంతో మోహన్‌లాల్‌పై పలువురు మండిపడుతున్నారు. ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా రాజీనామా చేయడం.. పిరికివాడిలో పారిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై నటుడు మోహన్‌లాల్ తాజాగా స్పందించాడు. మహిళా నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్’ (అమ్మ)ను లక్ష్యంగా చేసుకోవద్దని మాజీ అధ్యక్షడు మోహన్‌లాల్ తెలిపాడు. ఇందులో భాగంగానే హేమ కమిటీ నివేదికను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ నివేదికను రిలీజ్ చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం అని పేర్కొన్నాడు. అయితే అన్ని ప్రశ్నలకు ‘అమ్మ’ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని.. మలయాళ ఇండస్ట్రీ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని అన్నాడు. ఇందులో చాలా మంది ఉన్నారని.. అయితే అందరినీ నిందించలేమని చెప్పుకొచ్చాడు. దయచేసి పరిశ్రమను నాశనం చేయకండ అని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

RJ Shekar Basha: గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున .. తండ్రి అయిన శేఖర్ భాషా

Raghava Lawrence: దెయ్యాలను వదిలేసి రీమేక్ లు ఎందుకు బ్రో..?

Aay: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..

NTR: ఎన్టీఆర్ గొప్ప మనసు.. చావు బతుకుల్లో ఉన్న అభిమానికి ధైర్యం చెప్పిన దేవర

Devara: ఆ స్టార్స్ ఏంటి.. ఆ ఇంటర్వ్యూలు ఏంటి.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ తారక్

Actor Vijay: వరుస ప్లాపులు.. చివరి సినిమాకు అన్ని కోట్లు ఎలా అన్నా.. ?

Malavika Mohanan: ఇంటిమేటేడ్ సీన్స్.. దానిని తట్టుకోలేక.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Big Stories

×