EPAPER

Mohana Bhogaraju: పాటకు మోహనం ఆమె గాత్రం.. ‘బుల్లెట్ బండి’ సింగర్ మోహన్ భోగరాజు బర్త్ డే స్పెషల్

Mohana Bhogaraju:  పాటకు మోహనం ఆమె గాత్రం.. ‘బుల్లెట్ బండి’ సింగర్ మోహన్ భోగరాజు బర్త్ డే స్పెషల్

Mohana Bhogaraju: మోహన భోగరాజు.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘బుల్లెట్ బండి’ సాంగ్. ఆ మధ్య ఎక్కడ విన్నా ఇదే సాంగ్ మార్మోగిపోయింది. ఈ పాటతో మోహన భోగరాజు పేరు చక్కర్లు కొట్టింది. అయితే అంతక ముందుకూడా ఆమె చాలా పాటలు పాడి అలరించింది. నేడు ఈ సింగర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.


మోహన భోగరాజు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించారు. అయితే ఆమె ఫ్యామిలీ హైదరాబాద్‌లో స్థిరపడింది. మోహన భోగరాజు 6 ఏళ్ల వయస్సులో పాడటం ప్రారంభించారు. మొదటగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్‌లో ‘సయ్యామ మాసం’ అనే పాట ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మోహనకు అవకాశాలు పెద్దగా రాలేదు. అనంతరం కోరస్‌గా పాడినప్పటికీ ఆమెకు గుర్తింపు రాలేదు. ఆపై ఆమె కీరవాణి గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి మోహన వెనక్కు తిరిగి చూడలేదు. పలు సినిమాల్లో ఎన్నో సాంగ్‌లు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆమె గాత్రం అందించి పాటలకు ప్రాణం పోశారు. అందులో..


‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలో టైటిల్‌ సాంగ్‌

‘‘ఇరుక్కుపో.. హత్తుకోని వీరా వీరా.. కొరుక్కుపో.. నీ తనివితీరా తీరా’’ – బాహుబలి

‘‘ఓ బావా మా అక్కను సక్కగ సూస్తావా’’ – ప్రతిరోజు పండగే

‘‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ’’ – వకీల్ సాబ్

‘‘ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి’’ – అరవింద సమేత

‘‘హైలో హైలెస్సోరే.. హరిదాసులు వచ్చారే’’ – శతమానం భవతి

‘‘ సందల్లే.. సందల్లే’’- శ్రీకారం

‘‘డిక్క డిక్క డుం డుం’’ – సోగ్గాడే చిన్ని నాయనా

‘‘అమ్మ.. అమ్మే లేని జన్మేనీది’’ – అఖండ

‘‘నీతో ఉంటే చాలు..’’ – బింబిసార

‘‘కనులు నావైనా.. కలలు నీవేలే’’ – ఇజం

‘‘ఇరగ.. ఇరగ’’ – నా పేరు సూర్య నాఇల్లు ఇండియా

‘‘అయ్యయ్యో’’ – మేమ్ ఫేమస్

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వరంలోంచి జాలువారిన ప్రతి పాటా సూపర్ హిట్టే అయింది. అయితే ఈ పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మోహన భోగరాజు.. ‘‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు అని’’ సాంగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు. ప్రైవేట్ పాటే అయినా.. ఆమె పేరు మరింత మారుమోగి పోయింది. ఈ పాటకు అట్రాక్ట్ కాని యువత లేరంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మధ్య ఎక్కడ చూసినా ఈ సాంగే. వేడుకల్లో, ఆటోల్లో, కార్లలో ఇలా.. ఎక్కడ చూసినా ఈ పాటే ఊపేసింది. ఇప్పటికీ ఏ పెళ్లిలో చూసినా.. ఈ పాట వినిపిస్తుంటుంది. బుల్లెట్ బండి పాటలేకపోతే ఆ పెళ్లిలో సందడే కనిపించదు.

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×