EPAPER

Meenakshi Chaudary: ఆ స్టార్ హీరో కొడుకుతో హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?

Meenakshi Chaudary: ఆ స్టార్ హీరో కొడుకుతో హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?

Meenakshi Chaudary: ఈ మధ్య ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు అనౌన్స్ చేస్తున్నారు. సీక్రెట్ గా ఎఫైర్స్ నడుపుతూ చివరకు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని అనౌన్స్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లి డేట్స్ అనౌన్స్ చేసిన స్టార్స్ అందరు కూడా ఇలా రిలేషన్లో ఉన్నవారే. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అయిపొయింది. నచ్చితే పెళ్లి లేకుంటే బ్రేకప్ చెప్పేసుకొని బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఆ వార్తల్లో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు అందరికి తెలుసు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఆమె నటించిన అన్ని సినిమాల్లో ఆమె క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మరదలి పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. కేవలం గుంటూరు కారం మూవీ మాత్రమే కాదు ఈ సినిమా కంటే ముందే మీనాక్షి ఫేమస్ అయిపోయింది. హిట్-2, ఖిలాడి సినిమాలతో హీరోయిన్ గా నటించి బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలు అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ప్రస్తుతం వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ది గోట్ మూవీ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇవే కాకుండా ఈ హీరోయిన్ ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కా మూవీ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఇక దుల్కర్ సల్మాన్ తో మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొలీవుడ్ స్టార్ హీరోతో పెళ్ళికి సిద్దమైందని టాక్.. పెళ్లి ఫిక్స్ అయినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంత తక్కువ సమయంలోనే ఈ హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా ఇవి రూమర్సే అంటూ కొట్టి పారేస్తున్నారు. మరికొంత మందేమో మీనాక్షి చౌదరి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అనే వార్తలు ప్రస్తుతం చర్చనీయంశంగా మారాయి.. ఈ మధ్య హీరోయిన్ల పెళ్లిళ్ల గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని నిజమైతే, మరికొన్ని అబద్దం అవుతాయి. దీనిపై ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Related News

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

×