EPAPER
Kirrak Couples Episode 1

Masooda Movie Review : ‘మసూద’ రివ్యూ

Masooda Movie Review : ‘మసూద’ రివ్యూ

విడుదల: 18-11-2022
తారాగణం: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు


బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్, స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్

మళ్ళీ రావా లాంటి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత.. విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తన మూడో చిత్రంగా ‘మసూద’ అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీష్ చిత్రాలతో ఆకట్టుకున్న తిరువీర్ ఈ చిత్రంతో హీరోగా మారాడు. ఇక గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన కావ్య ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం…


కథ
గోపీ(తిరువీర్’ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తన సహోద్యోగి మినీ(కావ్య కల్యాణ్‌రామ్)ను ప్రేమిస్తుంటాడు. నీలం(సంగీత) ఓ ప్రైవేట్‌ స్కూల్‌‌లో సైన్స్ టీచర్‌. భర్త(సత్యప్రకాష్)తో విడిపోయిన నీలం తన కుమార్తె నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి గోపీ ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకు ఉంటుంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో నీలం ఫ్యామిలీతో గోపీ క్లోజ్‌గా ఉంటాడు. గోపీ ఓ రోజు తను ప్రేమించిన అమ్మాయిని అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తాడు. వారిద్దరూ క్లోజ్‌గా ఉన్న సమయంలో నీలం గోపీ ఇంటి తలుపుతడుతుంది. తన కుమార్తె నాజియా వింతగా ప్రవర్తిస్తోందని చెబుతుంది. గోపీ వెళ్లి చూసి ఆమెకు దెయ్యం పట్టిందని చెబుతాడు. ఆమెను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. వైద్యులతో ప్రయోజనం లేదని గ్రహించి చివరకు అల్లా ఉద్దీన్‌(సత్యం రాజేశ్‌)ను కలుస్తారు. అతడు తన వల్ల కూడా కాదని చెప్పడంతో పీర్‌ బాబా(శుభలేఖ సుధాకర్‌)ను కలుస్తారు. ఆ తర్వాత నాజియాకు పట్టిన దెయ్యం ‘మసూద’ అని తెలుస్తుంది. మసూద నుంచి నాజియాను కాపాడుకోడం కోసం గోపీ, నీలం ఏం చేశారు. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు మసూద కథ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
తెలుగులో ఇప్పటికే చాలా హారర్‌ సినిమా వచ్చాయి. అయితే వాటిలో కొన్నే విజయం సాధించాయి. ఈ మధ్య కాలంలో అయితే ప్రేక్షకులను పూర్తిగా థ్రిల్‌కు గురి చేసి భయపెట్టే సినిమాలు అయితే రాలేదు. ఇలాంటి టైమ్‌లో పూర్తిగా ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేలా హారర్ డ్రామాతో వచ్చిన ‘మసూద’ నిజంగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. స్టోరీ పాతదే అయినా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. దర్శకుడు సాయికిరణ్ తను అనుకున్నది అనుకున్నట్లు పక్కాగా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపథ్యం సంగీతం. కొన్ని శబ్ధాలు నిజంగా భయపెడతాయి. అలాగే నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ కూడా సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.

చీకటిలో కూడా విజువల్స్‌ను భలే క్యాప్చర్ చేశారు. అయితే అంతా బాన్నా నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఎడిటర్ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. హారర్ సినిమాలో లవ్ ట్రాక్‌ను కూడా నడిపించాలనే దర్శకుడి ప్రయత్నం బాగుంది. అయితే దాన్ని మరింతగా ఆకట్టుకునేలా తీసుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాకు సెకండ్ ఆఫ్ హైలైట్‌గా నిలిచింది. కథలోకి పీర్‌బాబా ఎంటర్‌ అయ్యాక ఆసక్తి కలుగుతుంది. కొన్ని సీన్లు నిజంగానే ప్రేక్షకులను భయానికి గురి చేస్తాయి. నిజంగా హారర్ సినిమాలు చూసి థ్రిల్ ఎంజాయ్ చేయాలనుకునే వారు ‘మసూద’ను హ్యాపీగా చూసేయొచ్చు. అయితే హృద్రోగులు ఈ సినిమా చూడకపోవడమే మంచిది.

నటీనటుల పనితీరు: టక్ జగదీష్‌లో విలన్‌గా భయపెట్టిన తిరువీర్ ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. దెయ్యాన్ని చూసి తను భయపడుతూ ప్రేక్షకులను భయపెట్టాడు. తిరువీర్ తర్వాత సీనియర్ నటి సంగీత కీలకమైన పాత్ర పోషించారు. దెయ్యం పట్టిన కుమార్తెను కాపాడుకునే పాత్రలో చక్కగా నటించారు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ ప్రేక్షకులను హత్తుకుంటుంది. హీరోయిన్ కావ్య తన పాత్ర పరిధి మేరకు నటించింది.

ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర బాంధవి శ్రీధర్‌ది. దెయ్యం పట్టిన అమ్మాయి నాజియా ఆమె నటన ఆకట్టుకుంటుంది. కథంతా నాజియా చుట్టే తిరుగుతుంది. దెయ్యం ఆవహించినప్పుడు ఒకలా, మామూలుగా ఉన్నప్పుడు ఒకలా వేరియేషన్స్‌‌ను బాగా చూపించింది. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో పీర్‌బాబా పాత్రలో ఒదిగిపోయారు. పీర్ బాబా అంటే బయటచూసేలా కాకుండా సింపుల్‌గా కనిపించారు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌ తన పాత్ర పరిధి మేరకు నటించారు. హీరో ఫ్రెండ్ పాత్రలో ఆర్జే హేమంత్ కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాతో నిర్మాత రాహుల్ యాదవ్‌కు హ్యాట్రిక్ హిట్ దక్కినట్లే.

సినిమా క్లైమాక్స్‌లో ‘మసూద’కు సీక్వెల్ ఉన్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చారు. అయితే ఇందులో ముస్లిం అమ్మాయి బాధిత యువతిగా కనిపించగా.. సీక్వెల్‌లో హిందూ అమ్మాయి ఆ పాత్రలో కనిపించే అవకాశం ఉంది.

రేటింగ్: 3.25/5
నిజంగా భయపెట్టే ‘మసూద’

Tags

Related News

Samantha: సమంత ఇంట పెళ్లి సందడి..

Deavara Release Trailer: ఇప్పుడు అందరి ఆశలు ఈ ట్రైలర్ పైనే.. ఇది కనుక క్లిక్ అయితే..

Zeenat Aman: అనసూయ విన్నావా.. ఆంటీ అంటే బూతు కాదంట, సీనియర్ నటి కామెంట్స్

Suchithra: ఆ లెజెండరీ డైరెక్టర్ పెద్ద కామ పిశాచి.. చచ్చే వరకు ఎవరిని వదలలేదు

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Big Stories

×