EPAPER

Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి స్టార్ హీరోల సినిమాలు.. ఇదిగో లిస్ట్

Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి స్టార్ హీరోల సినిమాలు.. ఇదిగో లిస్ట్


Upcoming Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్, ఓటీటీలో సందడి గట్టిగానే ఉండనుంది. భారీ అంచనాలతో కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

మరికొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. కాగా ఒక్కోసారి ఫుల్ హైప్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంటుంటాయి. కానీ, మరికొన్ని సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా మిగులుతాయి. అయితే మరి ఈ వారం థియేట‌ర్ల‌లో చాలానే సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


అయితే ప‌రీక్ష‌ల సీజ‌న్ వ‌చ్చేయ‌డంతో గోపీచంద్, విశ్వక్ సేన్ మిన‌హా మిగతా స్టార్ల సినిమాలు ఏవీ విడుద‌ల అయ్యేందుకు సిద్ధంగా లేవు. అయినా భారీ అంచ‌నాలతో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల‌తో క‌లిపి మొత్తం ఈ వారం 16 సినిమాలు. అలాగే ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.మరి ఆ సినిమాలు, సిరీస్‌లేవో ఇప్పుడు తెలుసుకుందాం.

థియేటర్ మూవీస్:

గామి:

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా రూపొందిన లేటెస్ట్ అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’. కొత్త దర్శకుడు విద్యాధర్‌ కాగిత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

భీమా:

గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘భీమా’. యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్‌ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రేమలు (తెలుగు):

ఇటీవల మలయాళంలో రిలీజైన కొత్త చిత్రం ‘ప్రేమలు’ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఏకంగా రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించి అందరినీ అబ్బురపరచింది.

నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని గిరీశ్‌ ఎ.డి తెరకెక్కించారు. ఇక అక్కడ సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది.

రికార్డ్ బ్రేక్:

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీలో నిహార్‌, రగ్ధా ఇఫ్తాకర్‌, నాగార్జున, సత్యకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్‌, సంజన కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

వీ ల‌వ్‌ బ్యాడ్ బాయ్స్‌:

రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వలో తెరకెక్కుతోన్న సినిమా ‘వీ లవ్ బ్యాడ్ బాయ్స్’. ఈ మూవీలో అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు బుల్లెట్, మైండ్ గేమ్, ఘన్నూ భాయ్, బాబు నెం.1 బుల్‌షిట్ గై, రాజు గారి అమ్మాయి.. నాయుడు గారి అబ్బాయి వంటి సినిమాలు మార్చి 8 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

హిందీ – మార్చి 8 :

షైతాన్

ఆల్ఫా బీటా గామా

తేరా క్యా హోగా లవ్లీ

ప్రేమ్ ఔర్ ఇష్క్

ఇంగ్లీష్‌ – మార్చి 8 :

ది కలర్ పర్పుల్

ఆల్ ఆఫ్ హ‌స్ స్ట్రేంజ‌ర్స్‌

ఓటీటీ సినిమాలు/ వెబ్ సిరీస్‌లు:

ఈటీవీ విన్‌:

నటి రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న లేటెస్ట్ హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. ఈ మూవీలో శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 6 నుంచి అంటే ఈ రోజు నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌:

అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8
ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7
డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8
ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8

డిస్నీ+ హాట్‌స్టార్‌:

షో టైమ్‌ (హిందీ): మార్చి 8

సోనీలివ్‌:

మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×