EPAPER

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీని ఎంతమంది ప్రేక్షకులు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నా కూడా వారు మాత్రం ఛారిటీ విషయంలో, సోషల్ సర్వీసుల విషయంలో ఎప్పుడూ వెనకడగు వేయరు. ఇప్పటికే ఎన్నో స్కూళ్లను దత్తత తీసుకొని అక్కడ పిల్లలకు క్వాలిటీ చదువు చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో 20 స్కూళ్లను దత్తత తీసుకున్నారు మంచు లక్ష్మి. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో ఏకంగా 20 స్కూళ్లను దత్తత తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. గతేడాది 30 స్కూళ్లు, ఇప్పుడు 20.. అలా మొత్తం 50 స్కూళ్లలో మార్పు తీసుకురానున్నారు మంచు లక్ష్మి. అంతే కాకుండా ఈ వివరాలను ప్రెస్‌తో పంచుకున్నారు.


అందుకే ఆ మండలం

‘‘గద్వాల్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. టీచ్ ఫర్ ఛేంజ్ కోసం ఇక్కడికి రావడం ఇది రెండోసారి. నితి అయోగ్ ద్వారా వెనకబడిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పిల్లలకు స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేయాలి అన్నదే మా ఉద్దేశ్యం. గతేడాది 30 స్కూల్స్‌ను అలా చేశాం. ఇప్పుడు ఇంకొక 20 స్కూల్స్‌ను చేయబోతున్నాం. వాటి ఓపెనింగ్స్ కోసమే వచ్చాను. మనందరం కలిసే ఈ పనిచేస్తున్నాం. ఇక్కడ నుండి చదువుకొని వెళ్లిపోయినవారు కూడా మంచి పొజిషన్స్‌లో ఉండుంటారు. మీరు కూడా ఒక స్కూల్‌ను బాగుచేస్తే ఊరినే బాగుచేసినట్టు’’ అని చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. గట్టు మండలంలో లిటరసీ రేట్ తక్కువగా ఉండడం వల్లే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు.


Also Read: దొరికిపోయిన ‘విశ్వంభర’… టీజర్లోనే ఇన్ని డమ్మీలైతే సినిమా పరిస్థితి ఏంటో?

స్మార్ట్ క్లాస్‌రూమ్స్

‘‘సిటీ, టౌన్స్‌లో జీవించేవాళ్లం ఎలాగైనా ముందుకు వెళ్లిపోతున్నాం. వెనకబడిన ఊళ్లల్లో మాత్రం ఎన్ని తరాలు వచ్చినా అలాగే ఉండిపోతున్నారు. అక్కడ పిల్లలకు విద్యాదానం చేయడం వల్ల పిల్లలకు రెక్కలొస్తాయి. వారు ఎక్కడికైనా ఎగరగలరు. మేము కూడా ముఖ్యమే అనే ఒక ఆలోచన వారికి వస్తుంది. ఈ సందర్భంగా దీనికి ఫండ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. గద్వాల్‌లో ఉండేవారు కూడా స్కూల్స్ దగ్గరకు వెళ్లి వాలంటీర్ చేయవచ్చు. యాదాద్రిలో స్మార్ట్ క్లాస్‌రూమ్స్‌తో 100 స్కూల్స్ నిర్మించాం. మీ మీద ప్రేమతోనే వెనక్కి వచ్చి ఏదో ఒకటి చేయాలనే తపనపడుతున్నాం’’ అంటూ అసలు స్కూల్స్‌లో తాము తీసుకొచ్చే మార్పులు ఏంటో చెప్పుకొచ్చారు.

టీచర్ల సపోర్ట్

‘‘క్లాస్‌రూమ్స్‌ను మంచిగా పెయింట్ చేసి, బెంచులు మార్చి, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న వసతులు అన్నీ గవర్నమెంట్ స్కూల్స్‌లోకి కూడా తీసుకొస్తాం. టీచర్స్‌కు కూడా మరింత మంచి ట్రైనింగ్ ఇస్తాం. మా వాలంటీర్స్ వారిని దగ్గరుండి ప్రోత్సహిస్తారు. దానికోసమే విద్యా వాలంటీర్స్‌ను క్రియేట్ చేస్తాం. గట్టు మండలంలో ఎక్కువమంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్‌లో కూడా ఒక్కరే టీచర్ ఉంటున్నారు. అందుకే టీచర్స్ సపోర్ట్‌ను కూడా స్కూల్స్‌కు అందించాలని అనుకుంటున్నాం’’ అంటూ తమ లక్ష్యాల గురించి బయటపెట్టారు మంచు లక్ష్మి. దీంతో ఇది విన్న ప్రేక్షకులంతా మంచు లక్ష్మి మనసు చాలా మంచిది అని ప్రశంసిస్తున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్ అనే కార్యక్రమం పిల్లల జీవితాలను మార్చేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

Pottel Controversy : క్యాస్టింగ్ కౌచ్ పై అనన్యకు ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ కంప్లయింట్

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Big Stories

×