EPAPER

Manchu Mohan Babu: రూ.500 కోట్లతో సినిమా చేస్తున్నారు.. వరద బాధితులకు ఒక్క రూపాయ్ కూడా ఇవ్వని మంచు ఫ్యామిలీ

Manchu Mohan Babu: రూ.500 కోట్లతో సినిమా చేస్తున్నారు.. వరద బాధితులకు ఒక్క రూపాయ్ కూడా ఇవ్వని మంచు ఫ్యామిలీ

Manchu Vishnu: అంచెలంచెలుగా ఒక్కో మెట్టు అధిరోహిస్తూ తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్నారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా ఏ పాత్రలో అయినా అవలీలగా ప్రవేశించి హీరోలకే ఛాలెంజ్ చేసే రేంజ్ కి ఎదిగారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేశారు. అయితే మోహన్ బాబులో నటుడిన గుర్తించిన దాసరి స్వర్గం-నరకం మూవీతో హీరోగా అవకాశం ఇచ్చారు. తొలి చిత్రంలోనే తాగుబోతు భర్తగా నటించారు. నెగెటివ్ రోల్ చేసినా అందరూ మోహన్ బాబునే గుర్తుంచుకున్నారు. అదే చిత్రంలో మరో హీరోగా చేసిన ఈశ్వర్ రావుని పెద్దగా ఆదరించలేదు జనం. అయితే ఈ మూవీ తర్వాత మోహన్ బాబుకు ఎక్కువగా విలన్ పాత్రలే లభించాయి. హీరోలతో తన్నులు తినే విలన్ గా నటిస్తూనే అవకాశం దొరికినప్పుడు హీరోగా చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మోహన్ బాబు.


సొంత బ్యానర్‌తో సినిమాలు..

సొంత బ్యానర్ స్థాపించి అద్భుతమైన ల్యాండ్ మార్క్ చిత్రాలను అందించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, విలన్ గా, హీరోగా అనేక చిత్రాలలో రాణించారు. అలనాటి ఎస్వీరంగారావు, కైకాల సత్యన్నారాయణ తర్వాత అంతటి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులతో సరిసమాన పాత్రలు చేస్తూ వచ్చారు. తర్వాత జనరేషన్ లోనూ చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలతో పనిచేశారు. తన ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులనూ హీరోలుగా చేశారు. కూతురు మంచు లక్ష్మి కూడా నటిగా, నిర్మాతగా, రియాలిటీ షో స్ లో చురుకుగా పాల్గొంటూ పేరు తెచ్చుకున్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా హీరోలుగా పలు విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ వస్తోంది.


అటు వ్యాపారం.. ఇటు సినిమాలు

సినిమా రంగం నుంచి వచ్చిన పేరు ప్రతిష్టలతో ఆర్థికంగానూ మంచు ఫ్యామిలీ బాగా స్థిరపడ్డారు. వాణిజ్య పరంగానూ బాగానే సెటిల్ అయ్యారు. తిరుపతికి సమీపంలో చిత్తూరు లో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ కార్పొరేట్ విద్యా సంస్థ. ప్రస్తుతం దీని వ్యవహారాలన్నీ మంచు విష్ణు చూసుకుంటున్నారు. మంచు విష్ణు కూడా నిర్మాతగా మారి సినిమాలు అందించారు. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తానే శివభక్తుడైన కన్నప్పగా నటిస్తున్నారు.

రూ.500 కోట్లతో భారీ బడ్జెట్ మూవీ

మంచు విష్ణు కెరీర్ లోనే ఈ తరహా భారీ బడ్జెట్ మూవీ రాలేదు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ‘కన్నప్ప’ మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర నటీనటులు నటిస్తుండటంతో మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇంత భారీ ఎత్తున సినిమా నిర్మిస్తున్న మంచు ఫ్యామిలీకి సామాజిక సమస్యలను పట్టించుకునే తీరిక లేదా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. పైగా మంచు విష్ణు మా అధ్యక్షుడు కూడా.. ఆయన నలుగురికి సాయం చేసి అందరిలో స్ఫూర్తి నింపాల్సిన స్థాయిలో ఉన్నారు. ఆయనే స్పందించకపోతే ఎలా అని జనాలు అంటున్నారు.

Also Read: బాలయ్యతో పోల్చకండి.. తారక్ కంటతడి పెట్టించాడు: కళ్యాణ్ రామ్

వరద సాయం ఏది?

ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. లక్షల సంఖ్యలో ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది. అయితే తెలుగు సినీ రంగంలో ప్రముఖ హీరోలు, నటులు స్పందించారు. తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చారు. అగ్ర హీరోలంతా ఒక్కొక్కరూ కోటి రూపాయల మేరకు సాయం అందించారు. చిన్నాచితకా హీరోలు కూడా వాళ్ల స్థాయి మేరకు సాయం అందించారు. అయితే మంచు ఫ్యామిలీలో ఇంతమంది నటులు ఉన్నా ఏ ఒక్కరూ వరద సాయంపై పెదవి విప్పలేదు. రూ.500 కోట్లు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీయడం కాదు..పెద్ద మనసు చేసుకుని సాటి వారికి సాయం అందించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ స్పందిస్తుందా లేదా అని గట్టిగానే అడుగుతున్నారు నెటిజనులు. వరద బాధితుల కష్టాలు చూసి.. మంచు ఫ్యామిలీ మనసు కరగలేదా అని అంటున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×