EPAPER
Kirrak Couples Episode 1

Manchu Family: మోహన్ బాబు ఇంట్లో నగదు చోరీ.. కేస్ ఫైల్..!

Manchu Family: మోహన్ బాబు ఇంట్లో నగదు చోరీ.. కేస్ ఫైల్..!

Manchu Family : విలన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ఎంతోమంది ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న మోహన్ బాబు (Mohan Babu).. డైలాగ్ డెలివరీ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా దాటేశారు అనడంలో సందేహం లేదు. ఒకసారి డైలాగ్ విన్నారు అంటే అనర్గళంగా ఆ డైలాగ్ చెబుతూ.. డైలాగ్స్ తోనే అందరిని మెప్పించేవారు. ముఖ్యంగా తన సినిమాలతో భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డు క్రియేట్ చేసిన మోహన్ బాబు.. కలెక్షన్ కింగ్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం.


మోహన్ బాబు ఇంట్లో నగదు చోరీ..

Manchu Family: Cash theft at Mohan Babu's house.. Case file..!
Manchu Family: Cash theft at Mohan Babu’s house.. Case file..!

తాజాగా మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం. జల్ పల్లి లో ఉన్న ఆయన నివాసంలో పనిచేసే నాయక్ అనే వ్యక్తి రూ .10 లక్షల డబ్బు దొంగలించి పారిపోయినట్లు మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ స్టేషన్ లో తన ఫిర్యాదును అందజేశారు. ఆయన ఫిర్యాదు మేరకు హుటాహుటిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నాయక్ ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.


దొంగతనం తొలిసారి కాదు..

ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంట్లో ఇంతకు ముందు కూడా దొంగతనం జరిగింది. 2019లో ఇదే తరహాలో ఫిలింనగర్ లో ఉన్న తన ఇంట్లో పని చేసే పనిమనిషి డబ్బులు, నగలు దొంగలించింది అంటూ మోహన్ బాబు కుటుంబం బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి రాచకొండ పరిధిలో ఉన్న తన ఇంటిలో దొంగతనం జరగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు మోహన్ బాబు ఇంట్లోనే ఎందుకు ఇలా వరుస దొంగతనాలు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

మోహన్ బాబు కెరియర్..

ప్రముఖ నటుడిగా, చలనచిత్ర నిర్మాతగా, రాజకీయవేత్తగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి అయిన ఈయన దాదాపు 500 కు పైగా చిత్రాలలో హీరోగా ,సహాయ నటుడిగా విభిన్న పాత్రలలో నటించారు. భక్తవత్సలం నాయుడు తిరుపతి సమీపంలోని మోదుగులపాలెం అనే గ్రామంలో మంచు నారాయణస్వామి నాయుడు , మంచు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వై ఎం సి ఏ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా తన వృత్తిని కొనసాగించిన ఈయన ఆ సమయంలో స్క్రిప్టు రైటర్ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడి, తన కెరీర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. సినిమాల్లోకి వచ్చాక మోహన్ బాబు గా పేరు మార్చుకున్నారు.. 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం చిత్రంతో నటుడిగా మొదటిసారి సక్సెస్ అందుకున్నారు.అలా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన విద్యాసంస్థలకు చైర్మన్ కూడా. అంతేకాదు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

Related News

Jani Master : జానీ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన కోర్టు… కస్టడీకి గ్రీన్ సిగ్నల్

Celebrities: పిల్లల్ని దత్తత తీసుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

Game Changer : చెర్రీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఐఫా అవార్డుల వేదికపై గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్

Tollywood :క్రేజ్, క్యాష్ కోసమే తెలుగు సినిమాలు… ఈ హిందీ స్టార్లకు తెలుగు ప్రమోషన్ లలో పాల్గొనడం నమోషి

Devara OTT : ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్… నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రిమెంట్ ఎలా జరిగిందంటే..?

Harsha Sai Case : మత్తు మందు ఇచ్చి అత్యాచారం… ఆపై వీడియోలు… బయటికి వస్తున్న హర్ష సాయి లీలలు

Big Stories

×