EPAPER

Bramayugam Twitter Review: భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Bramayugam Twitter Review: భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Bramayugam

Bramayugam Twitter Review (latest movies):


మలయాళ స్టార్ మమ్ముట్టి వైవిధమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాజిటివ్, నెగెటివ్ అనే తేడా లేకుండా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు. తాజాగా అలాంటి డిఫరెంట్ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘భ్రమయుగం’.

మంచి అంచనాలతో రూపొందిన ఈ సినిమాను మొదట మలయాళం, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టపోన్ అయింది. అయితే మలయాళంలో ఈ రోజు రిలీజ్ కానుంది. ఈ మేరకు ఈ సినిమా ప్రీమియర్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం.


రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ మూవీ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులోని హారర్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని.. ట్విస్ట్‌లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. రెండు డిఫరెంట్ టైమ్‌లైన్లలో అద్భుతమైన పాయింట్లను యాడ్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడని చెబుతున్నారు.

READ MORE: ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్ ‘డంకి’.. సడన్ సర్ప్రైజ్ మామూలుగా లేదు..

కథ:

ఓ పాడుబడ్డ మహల్‌లోకి తేవన్ అనే ఓ గాయకుడు అనుకోకుండా వెళ్తాడు. ఆ రహస్య మహల్‌లో ఆ గాయకుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు రాహుల్ ఇంట్రెస్టింగ్‌గా చూపించాడని అంటున్నారు.

ఇక ఈ మూవీలో హారర్‌తో పాటు కుల వివక్షను కూడా అంతర్లీనంగా చర్చించినట్లు నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఈ మూవీలో మమ్ముట్టి హీరోనే అయినా.. అతడితో పాటే అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ పాత్రలకు ప్రాధాన్యత సమానంగా ఉంటుందని అంటున్నారు.

ఈ మూవీ క్యారెక్టర్స్ ప్రధానంగానే నడుస్తుందని.. ఇందులో హీరోలు, విలన్లు కనిపించరని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో మమ్ముట్టి పాత్ర పూర్తిగా నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఇందులో మమ్ముట్టి లుక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా.. ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు.

READ MORE: ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ రివ్యూ.. సందీప్‌కు హిట్టు పడినట్లేనా..!

ఈ మూవీలో అతడి నటన అద్భుతంగా ఉందని.. నట విశ్వరూపాన్ని అతడు మరోసారి చూపించాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో విజువల్స్ కూడా ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.2.5 కోట్ల వరకు జరగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాపై ఉన్న హైప్‌తో మొదటి రోజు భ్రమయుగం దాదాపు రూ.10 కోట్ల వరకు గ్రాస్, రూ.5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూళు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మమ్ముట్టి ఖాతాలో మరో హిట్టు పడ్డట్టే అని చెప్పాలి.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×