EPAPER

Mama Mascheendra Movie Review: మ్యాజిక్ తప్ప లాజిక్ మిస్ అయిన మామ మశ్చీంద్ర…

Mama Mascheendra Movie Review: మ్యాజిక్ తప్ప లాజిక్ మిస్ అయిన మామ మశ్చీంద్ర…

Mama Mascheendra Movie Review: పట్టు వదలని విక్రమార్కుడిలా మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ ట్రిపుల్ యాక్షన్ మూవీ మామ మశ్చీంద్ర. ఏకంగా ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేశాడు. రొటీన్ కథ, డిఫరెంట్ యాంగిల్ తో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.


చిత్రం : మామా మశ్చీంద్ర
నటీనటులు : సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్షవర్ధన్.
నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
దర్శకత్వం : హర్షవర్ధన్
సంగీతం : చైతన్ భరద్వాజ్
విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

స్టోరీ :


అనగనగా ఒక ఊరు ఆ ఊరి లో కొన్ని సంఘటనల ప్రభావం వలన బంధాలకు, బంధుత్వాలకు అతీతంగా
బండరాయిలా తయారైన పరశురామ్ ( సుధీర్ బాబు). ఎమోషనల్ స్టోరీ లో ఉన్నట్టుగానే అతనికి ఒక చెల్లి ,బావ, ఇద్దరు మేనల్లుళ్లు. కొన్ని పరిస్థితుల వల్ల తన సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని పరశురామ్ అతని మనిషి దాసు(హర్షవర్ధన్) కు చెబుతాడు. అయితే వాళ్లు దాసు చేతుల్లోంచి తప్పించుకుంటారు. కట్ చేస్తే కొంతకాలానికి పరశురామ్ కి ఒక కూతురు..విశాలాక్షి ( ఈషా రెబ్బ).. దాసు కు ఒక కూతురు మీనాక్షి.

అన్ని స్టోరీల మాదిరిగానే పెరిగి పెద్దయిన పరశురామ్ మేనల్లుళ్లు…దుర్గ ..విశాలాక్షి ని లవ్ చేస్తే…మీనాక్షి ..డీజే ను ఇష్టపడుతారు. ఈ విషయం తెలుసుకున్న పరశురామ్ వాళ్ళిద్దరి అడ్డు తొలగించాలి అనుకుంటాడు. కానీ వాళ్లను తన కూతుర్లే ఇష్టపడుతున్నారు అని తెలుసుకొని కాస్త ఆలోచనలో పడతాడు. ఇక ఆ తర్వాత తనమీద కక్ష సాధించడానికి కూతుర్ల వెనక పడ్డారా అన్న అనుమానం కూడా అతనికి కలుగుతుంది. ఆ తర్వాత కథలో ఎటువంటి మలుపులు చోటు చేసుకున్నాయి? చంపాలి అనుకున్న పరశురామ్ ఎలా మారాడు? అసలు పరశురామ్ని అంతా కటోరంగా మార్చిన చిన్ననాటి పరిస్థితులు ఏమిటి? తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

డైరెక్టర్ గా హర్షవర్ధన్ ఎటువంటి జిమ్మిక్స్ చేస్తాడో మనకు తెలుసు. అతను ఎంచుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు మొదటి 20 నిమిషాలు అయితే సినిమా టేకింగ్ మనల్ని వేరే లెవెల్ కి తీసుకువెళ్తుంది. అంతా బాగుంది ఓ టెంపో లో వెళ్తున్నాం అనుకునే టైంకి సడన్గా సినిమా చెప్పబడిపోతుంది. మరి ముఖ్యంగా ఇద్దరు కుర్ర సుధీర్ బాబుల కు పరశురామ్ కూతుర్లకు మధ్య లవ్ ట్రాక్ మరింత సాగదీత గా ఉంది.

కథ కూడా చాలా వరకు రోటింగా నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేసే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి సినిమా చాలా బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త పరవాలేదు. ఎండింగ్ అయితే మరీ రొటీన్ గా ఉంది. కాస్త మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మూడు పాత్రలకు సుధీర్ బాబు న్యాయం చేసినప్పటికీ పరశురామ్ క్యారెక్టర్ డబ్బింగ్ మాత్రం కాస్త తేలిపోయింది. పైగా మోడరన్ గా ఉండే పరశురామ్ ను చూస్తే ఏదో పెద్ద వయసు వాడిని చూసిన భావన కలగదు.. ఓ యంగు వ్యక్తికి తలకి తెల్ల రంగు పులిమినట్టు ఉంటాడు. ఇద్దరు కుర్ర సుధీర్ బాబులను వేరియేషన్ చూపించడం కోసం ఒకరిని కాస్త లావుగా చూపించారు. అక్కడ అక్కడ అది కాస్త ఆడ్ ఉంది.

ఇక బంధానికి బంధుత్వానికి లొంగని పరశురామ్ కూతుర్ల విషయంలో మాత్రం చాలా పాజిటివ్ గా ఉంటాడు. ఈ సినిమాలో మ్యాజిక్ తప్ప లాజిక్ ఎక్కడ కనిపించదు. డైరీలో రాసుకో …ఎవరికీ చెప్పకు…డాడీ కూచ్చులు లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ట్రైలర్ లో బాగున్నాయి కానీ సినిమాలో ఆ ఎఫెక్ట్ ఇవ్వలేకపోయాయి. మధ్య మధ్యలో వచ్చే సీన్స్ కి అసలు పొంతన లేకుండా ఉండడం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మొత్తానికి మూవీ టేకింగ్ పర్వాలేదు అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

మొదటిసారి త్రిపాత్రాభినయం ట్రై చేసిన సుధీర్ బాబు బాగానే.

నిర్మాణ విలువలు చిత్రానికి తగినట్టుగా బాగా ఫాలో అయ్యారు.

కొన్ని కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.

సినిమా మొదటి 20 నిమిషాలు హైలెట్.

మైనస్ పాయింట్స్: స్టోరీ చాలా రొటీన్ గా నెక్స్ట్ ఏమి జరుగుతుందో ఈజీగా తెలిసిపోయే విధంగా ఉంటుంది. సినిమాలో లాజిక్ అనేది లేదు, ఫస్ట్ హాఫ్ లవ్ యాంగిల్ బాగా సాగదీశారు.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్ : మాకు లాజిక్ తో పనిలేదు.. ఏదో రొటీన్ గా సినిమా చూడడానికి వచ్చాం ..పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు.. అనుకునే వాళ్ళకి ఈ మూవీ మంచిగా సెట్ అవుతుంది.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×