Anju Kurian: ఒకప్పుడు పెళ్లయితే హీరోయిన్ల కెరీర్‌కు బ్రేక్ పడినట్టే అని, మళ్లీ వారిని వెండితెరపై చూడడం కష్టమే అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ రోజులు మారిపోయాయి. పెళ్లయినా, పిల్లలు పుట్టినా కూడా ఆ ఎఫెక్ట్‌ను తమ కెరీర్‌పై పడనివ్వడం లేదు నటీమణులు. అందుకే ఒక మలయాళీ ముద్దుగుమ్మ కూడా తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యింది. తాజాగా ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకొని, దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మలయాళీ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. అంజు కురియన్ (Anju Kurian). తను తెలుగులో కూడా ఒక సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలు
కేరళలోని కొట్టాయంలో పుట్టి పెరిగింది అంజు కురియన్. అందుకే తన మాతృభాష అయిన మలయాళం సినిమాలతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యింది. కానీ మొదట్లో అంజుకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇతర చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ అవ్వడం కోసం కష్టపడింది. 20213లో ‘నేరమ్’ మూవీలో హీరోకు చెల్లిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అంజు. కొన్నేళ్ల పాటు ఇలాంటి పాత్రల్లోనే నటించిన తర్వాత 2016లో విడుదలయిన ‘కవి ఉద్దేశిషత్తు’ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో బిజీ అయిన అంజు కురియన్.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం విశేషం.
Also Read: శ్రీలీల చేతిలోని అవకాశాన్ని లాగేసుకున్న పూజా హెగ్డే.. ఇది కదా రివెంజ్ అంటే!
ఇదొక అద్భుతం
కొట్టాయంకు చెందిన రోషన్ జాకోబ్ కరిప్పరంబిల్ అనే బిజినెస్‌మ్యాన్‌తో అంజు కురియన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తన ఫ్యాన్స్ అంతా అంజుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. వారి జంట చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు మాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అంజు ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తనకు విషెస్ తెలిపారు. ‘మమ్మల్ని ఈ మూమెంట్‌కు చేర్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటాను. నవ్వులతో, ప్రేమతో సాగే ఈ ప్రయాణం మా దృష్టిలో ఒక అద్భుతం’ అంటూ రోషన్ కరిప్ప (Roshan Karippa)పై ఉన్న ప్రేమను బయటపెట్టింది అంజు కురియన్.
రీచ్ రాలేదు
కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది అంజు కురియన్. తమిళంలో పలువురు యంగ్ హీరోల సరసన నటించిన అంజు.. తెలుగులో మాత్రం ఒక్కటే ఒక సినిమాలో కనిపించింది. సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇదంజగత్’ అనే మూవీతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదొక థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కినా కూడా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది. అందుకే అంజుకు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా రాలేదు. తను చివరిగా మమ్ముట్టి, జయరామ్ కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహం ఓజ్లర్’లో చిన్న పాత్రలో అలరించింది. ప్రస్తుతం తన చేతిలో ‘వోల్ఫ్’ అనే సినిమా ఉంది.
#AnjuKurian Engagement Pics 💃🏼♥️ pic.twitter.com/2ALaOD8ecC
— SillakiMovies (@sillakimovies) October 26, 2024