EPAPER

ARM Movie Review: టొవినో థామస్‌ ‘ARM’ ఎలా ఉంది? ఈ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే

ARM Movie Review: టొవినో థామస్‌ ‘ARM’ ఎలా ఉంది? ఈ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే

ARM Movie Review: మలయాళ నటుడు టొవినో థామస్‌ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ అనువాదమై విడుదల అయ్యాయి. మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా టొవినో థామస్ హీరోగా కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా ‘A.R.M’ (Ajayante Randam Moshanam) సినిమా తెరకెక్కింది.


ఈ సినిమా ఇవాళ(సెప్టెంబర్ 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టొవినో నటించిన 50వ సినిమా కావడంతో ప్రేక్షకులలో బాగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకీ ‘A.R.M’ కథ ఏంటంటే..?


అజయన్‌ (టోవినో థామస్‌) చియోతికావు అనే గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా జీవనం కొనసాగిస్తాడు. వాళ్ల తాత అప్పట్లో దొంగతనాలు చేసే వాడు. ఆ ఎఫెక్ట్ అజయన్ మీద ఉంటుంది. అతడికి, అతడి కుటుంబానికి వాళ్ల ఊళ్లో పెద్దగా గౌరవం ఇవ్వరు. ఏ ఊరిలో దొంగతనం జరిగినా పోలీసులు ముందుగా అజయన్ నే అనుమానిస్తారు.

అదే సమయంలో వాళ్ల ఊళ్లో ఎన్నో మహిమలు కలిగిన అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఊళ్లో ఉత్సవాలు జరగడానికి 10 రోజుల ముందు ఆ విగ్రహాన్ని ఊళ్లోని ఓ వ్యక్తి దొంగిలిస్తాడు. ఆ దొంగతనాన్ని అజయన్ మీద వేయడానికి ప్రయత్నిస్తారు.

ఇంతకీ ఆ విగ్రహం ఎక్కడ ఉంటుంది? ఆ విగ్రహాన్ని దొంగిలించింది ఎవరు? అనేది సినిమాలో చూడాలి. అదే సమయంలో పక్క ఊరికి చెందిన గ్రామ పెద్ద పరము నంబియార్‌ కూతురును అజయన్ ప్రేమిస్తాడు. ఆ విషయం తెలుసుకుని తక్కువ కులానికి చెందిన అజయ్ మీద పగ తీర్చుకునేందుకు ఎలా ప్రయత్నించాడు?

ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అనుకునే అజయ్ అమ్మ(రోహిణి) కల నెరవేరుతుందా? ఆ ఊరి జాతరను డాక్యుమెంటరీగా రూపొందించేందుకు సుదేవ్ వర్మ(హరీష్ ఉత్తమన్) ఎందుకు వచ్చాడు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ఈ సినిమా ఎలా ఉందంటే?

‘A.R.M’ సినిమాను మూడు తరాలకు లింక్‌ చేస్తూ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కించారు దర్శకుడు జతిన్‌ లాల్‌. సినిమా చాలా వరకు దొంగతనాలు, వాటిళ్ల తక్కువ జాతి వాళ్లు పడే ఇబ్బందులను చూపించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని ప్రతిష్టాత్మక విగ్రహాన్ని మణియన్ ఎందుకు దొంగతనం చేశాడు అనే కాస్త ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు.

ఆలయంలో ఉన్నది అసలు విగ్రహం కాదని తెలుసుకున్న అజయన్, ఒరిజినల్ విగ్రహం కోసం వెతికే ప్రయత్నం బాగుంటుంది. ఈ సినిమాలో చాలా అంశాలు ‘సాహసం’ సినిమాను పోలి ఉంటాయి. మణియన్‌, ఆయన మనువడు అజయన్‌ కు సమాజం నుంచి ఎలాంటి ఎలాంటి చులకన ఎదురవుతుంది? అనేది చాలా అద్భుతంగా చూపించారు.

వాళ్లు అనుభవించే మానసిక సంఘర్షణను చక్కటి తెరమీద ఆవిష్కరించారు. అజయన్ తల్లి పాత్రలో రోహిణి ఎమోషన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఒక ఊళ్లో ఓ కుటుంబం పరువు తీస్తే, ఆ పరువును తిరిగి తెచ్చుకునేందుకు.. ఎంత బలంగా ప్రయత్నించారు అనేది అద్భుతంగా చూపించారు.

సినిమా ముగింపులో అసలు విగ్రహాన్ని ఊరి వాళ్లచేతి అవమానానికి గురైన అజయన్‌ తల్లి తీసుకొచ్చి గుడిలో అప్పగించే సన్నివేశాలు గొప్పగా ప్రజెంట్ చేయాల్సి ఉన్నా, అనుకున్న స్థాయిలో చూపించలేకపోయాడు దర్శకుడు. డైలాగులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయి. స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంది. కథ అప్పుడప్పుడు సో అనిపించినా, మణియన్ పాత్ర వాటిని బ్యాలెన్స్ చేసింది.

Also Read: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ పెరగడానికి కారణం అదేనా?

ఎవరి నటన ఎలా ఉందంటే?

ఆయా నటీనటులు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, మూడు తరాలకు చెందిన కేలు, మణియన్, అజయన్ పాత్రల్లో టొవినో థామస్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మూడు పాత్రల్లోనూ ఒదిగిపోయి నటించాడు. లక్ష్మి పాత్రలో కృతిశెట్టి చక్కగా కనిపించింది. చోటి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కాసేపే కనిపించినా అద్భుతంగా ఆకట్టుకుంది.

మాణిక్యం పాత్రలో సురభి లక్ష్మీ మెప్పించింది. అజయన్ తల్లిగా రోహిణి క్యారెక్టర్ లో ఇడిమిపోయి నటించింది. హరీష్‌ ఉత్తమన్‌ తో పాటు ఇతర నటులు బాగానే ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు దిబు నినన్‌ థామస్‌ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉంది. జోమోన్‌ టి జాన్‌ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది.

దర్శకుడికి ఇది మొదటి సినిమానే. అయినా  బాగానే హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా మూడు తరాలు, మూడు పాత్రలను బాగా బ్యాలెన్స్‌ చేశాడు. కథను ప్రేక్షకులు ముందుగానే ఊహించేసుకొనేలా సీన్స్ ఉండటం ఈ సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు.

సినిమా ఓపెనింగ్ సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి. కానీ.. ఆ తర్వాత స్లో అయ్యింది. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ బోరింగ్‌ అవుట్‌డేటెడ్ లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. నిజానికి దర్శకుడు తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ కి సరైన క్లారిఫికేషన్ లేదు. పాయింట్ వైజ్ గా స్టోరీ ఓకే అనిపించినా, స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండాలి.. ఇది డైలాగ్ ఓరియెంటెడ్ మూవీ కాదు. డైరెక్షన్ ఓకే..బ్యాక్ స్టోరీ బాగుంది. కానీ, స్టోరీ టెల్లింగ్, ఫస్ట్ హాఫ్ మీద కూడా ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది.

పాజిటివ్ అంశాలు:

❤ సినిమాటోగ్రఫీ
❤ టోవినో థామస్
❤ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
❤ బ్యాక్ స్టోరీ (ట్విస్ట్)

నెగెటివ్ అంశాలు

⦿ స్టోరీ టెల్లింగ్
⦿ మొదటి సగం
⦿ సరైన వివరణలు లేకపోవడం
⦿ పాటలు
⦿ అవుట్ డేటెడ్ లవ్ ట్రాక్

‘బిగ్ టీవీ’ రేటింగ్: 2.5/5

Related News

Tammareddy Bharadwaj: త్రివిక్రమ్ పై పూనమ్ ఫిర్యాదు.. మేము ఏం చేయలేం

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Garudan: తమిళ్ రీమేక్ లో కుర్ర హీరోలు.. ఒకరిని మించి ఒకరు ఉన్నారే

Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ

Martin:మార్టిన్ సినిమా పోస్ట్ పోన్ కానుందా.. అసలు కారణం ఏంటంటే..?

Akkineni Nagarjuna: N కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున అన్నయ్య సంచలన వ్యాఖ్యలు

Gorre Puranam : గొర్రె పురాణం రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? సినిమాను పట్టించుకోని నిర్మాత, హీరో

Big Stories

×