EPAPER

Mahesh Babu: ప్రజలు మీపై ఉంచిన విశ్వాసమే ఈ విజయం.. పవన్ గెలుపుపై మహేష్ ట్వీట్

Mahesh Babu: ప్రజలు మీపై ఉంచిన విశ్వాసమే ఈ విజయం.. పవన్ గెలుపుపై మహేష్ ట్వీట్

Mahesh Babu: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెల్సిందే. పవన్ విజయాన్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.అభిమానులతో పాటు స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి.. పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.


తాజాగా మహేష్ సైతం తన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ” పవన్ కళ్యాణ్.. మీ చిరస్థాయిలో నిలిచిపోయే గెలుపుకి నా అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకం మరియు విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం. ఈ ఐదేళ్లు అద్భుతంగా ప్రజల కోసం పనిచేస్తూ మన ప్రజల కలలు తీర్చాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు.

ఇక చంద్రబాబుకు కూడా మహేష్ అభినందనలు తెలిపాడు. ” ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఘన విజయంసాధించినందుకు చంద్రబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు APకి అభివృద్ధి మరియు శ్రేయస్సుతో కూడిన విజయవంతమైన పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


పవన్ – మహేష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరి ఫ్యాన్స్ బయట కొట్టుకున్నా.. మహేష్ మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీలో అందరితో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటాడు. పవన్ నటించిన జల్సా సినిమాకు మహేష్ గాత్రదానం చేశాడు. ఒక స్టార్ హీరోకు.. మరో స్టార్ హీరో ఇలా వాయిస్ చెప్పడం అనేది రికార్డ్. ఇక ఈ పోస్ట్ చూసిన పవన్ ఫ్యాన్స్ మహేష్ కు థాంక్స్ చెప్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Big Stories

×