EPAPER

Roopa Ganguly: మహాభారత ‘ద్రౌపది‘ అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి రూపా గంగూలి, అసలు ఏం జరిగింది?

Roopa Ganguly: మహాభారత ‘ద్రౌపది‘ అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి రూపా గంగూలి, అసలు ఏం జరిగింది?

Roopa Ganguly Arrest: ‘మహాభారతం’ సీరియల్ లో ద్రౌపది పాత్ర పోషించి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు రూపా గంగూలీని బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి వేళ ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోల్ కతా హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్లారు. రాత్రంతా అక్కడే ఉన్న ఆమెకు అలీపూర్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఇంతకీ అసలు ఆమె ఎందుకు అరెస్టు అయ్యారంటే..


విద్యార్థి మృతికి కారకులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన    

కోల్ కతా లాల్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి ట్యూషన్ కు వెళ్తుండగా అటుగా వెళ్తున్న ఎక్స్‌ కవేటర్‌(జేసీబీ) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 ఏండ్ల బాలుడు అక్కడికి అక్కడే చనిపోయాడు. స్థానికులు డ్రైవర్ ను పట్టకునేందుకు ప్రయత్నించడంతో పారిపోయాడు. కోపంతో ఆ వాహనాన్నిధ్వంసం చేశారు. ఆ ఎక్స్‌ కవేటర్‌(జేసీబీ) స్థానిక టీఎంసీ కౌన్సిలర్ ది కావడంతో పోలీసులు  డ్రైవర్ ను అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళన బాట పట్టారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలంటూ రూబీ దాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.


ఆందోళన చేస్తున్న కాషాయ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి లాల్ బజార్  పీఎస్ కు తరలించారు. విద్యార్థి చావుకు కారణం అయిన వాళ్లను వదిలిపెట్టి, వారిని అరెస్టు చేయాలని ఆందోళన చేసిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడంపై రూపా గంగూలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాల్ బజార్ పోలీస్ స్టేషన్ ముందుకు బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలను విడుదల చేయడంతో పాటు విద్యార్థి మృతికి కారణం అయిన వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 రూపా గంగూలీని అరెస్ట్ చేసిన పోలీసులు

లాల్‌బజార్‌ పీఎస్ ముందుకు ఆందోళన చేసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ కు తరలించారు. రాత్రంతా ఆమె అక్కడే ఆందోళన చేశారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు. “నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి పనికి అడ్డు చెప్పలేదు. ఆ అబ్బాయి హత్యకు కారకులను అరెస్టు చేయాలని శాంతియుతంగా కూర్చున్నాను. నేను ఎవరికీ హాని కలిగించకపోయినా పోలీసులు నన్ను అరెస్టు చేసి, అసత్య అభియోగాలు మోపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రూ. 1000 పూచీకత్తుపై కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఇంతకీ రూపా గంగూలీ ఎవరు?

రూపా గంగూలీ 1980లో ప్రముఖ బుల్లితెర నటిగా వెలుగొందారు. భారతీయ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘మహాభారతం’ సీరియల్ లో ఆమె ద్రౌపది పాత్రను పోషించారు. అద్భుత నటనతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమనులను సొంతం చేసుకున్నారు. ఈ టీవీ సిరీస్‌లో రూపా గంగూలీ నటనకు  స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డుతో పాటు అనేక అవార్డులు, రివార్డులను అందుకున్నారు.

‘మహాభారతం’తో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మృణాల్ సేన్, అపర్ణా సేన్, గౌతమ్ ఘోష్, రితుపర్ణో ఘోష్ లాంటి దర్శకులతో పనిచేశారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశారు.  1987లో రామప్రసాద్ బానిక్ దర్శకత్వం వహించిన బెంగాలీ TV సిరీస్ ‘ముక్తబంధ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో హిందీ TV సిరీస్ ‘గణదేవత’తో బాగా పాపులర్ అయ్యారు. 1993లో ‘కానూన్’, 1994లో ‘చంద్రకాంత’, 2007లో ‘కరమ్ అప్నా అప్నా’, 2009లో ‘కస్తూరి’, 2009లో ‘అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో’ లాంటి సిరీస్ లతో అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2015లో రాజకీయాల్లో ఎంట్రీ

బుల్లితెర, వెండితెరపై సత్తా చాటిన రూపా గంగూలీ 2015లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  2016 బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ హౌరా నార్త్ నుంచి పోటీ చేసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి,  క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా చేతిలో ఓడిపోయారు. అంతకుముందు రాజీనామా చేసిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్థానంలో ఆమె అక్టోబర్ 2016లో రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు.

Read Also: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Related News

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు..

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

Thalapathy 69: ఘనంగా పూజా కార్యక్రమాలు.. విడుదల ఎప్పుడంటే..?

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Big Stories

×